Crew 3 days Collections: బాక్సాఫీస్‌ను రఫాడిస్తున్న కరీనా, కృతి, టబు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్, ప్రముఖ నటుడు అనిల్ కపూర్, తన కుమార్తె సోనమ్ కపూర్ నిర్మాతలుగా వ్యవహరించిన చిత్రం క్రూ (Crew). టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్, దిల్జిత్ దొసాంజ్, కమెడియన్ కపిల్ శర్మ నటించిన ఈ చిత్రానికి రాజేశ్ ఏ కృష్ణన్ దర్వకత్వం వహించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ , అనిల్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం మార్చి 29 ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే..

క్రూ సినిమాను భారీ తారాగణంతో నిర్మించడంతో బడ్జెట్ ఎక్కువగానే అయింది. ఈ సినిమాకు స్టార్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 60 కోట్ల రూపాయల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు అటెన్షన్ పెరగడంతో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభించింది.

Crew Hindi Movie 3 days Expected Box Office Collections Worldwide

కరీనా కపూర్ సినిమాకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో రిలీజ్‌కు ముందు ఈ సినిమా సుమారుగా 3 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2000 వేల స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 45 కోట్లు నికరంగా వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కీర్తీ సనన్ కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం తొలి రోజు 10.5 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ రాబట్టింది. ఇక తొలి రోజు వచ్చిన పాజిటివ్ రిపోర్టుతో రెండో నిలకడగా అంటే 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో రోజు ఈ సినిమా 11 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియాలో ఈ చిత్రం 33 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది.

Crew Hindi Movie 3 days Expected Box Office Collections Worldwide

ఇక ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం 3 రోజుల్లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ వసూలు చేసింది. అంటే ఓవర్సీస్‌లో ఈ చిత్రం 8.5 కోట్లకుపగా కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం మొత్తంగా 30 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా బాలీవుడ్‌‌ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది.

ఇక ఈ సినిమా సోమవారం, మంగళవారం కనుక బాక్సాఫీస్ వద్ద బలంగా ఉండగలిగితే..ఆ తర్వాత రోజులన్నీ హాలీడేస్ ఉండటంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X