కరీనా కపూర్ మూవీ కలెక్షన్ల ఊచకోత.. 100 కోట్లకు చేరువగా క్రూ.. 6వ రోజు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ ముద్దు గుమ్మలు కరీనా కపూర్, కృతిసనన్, టబూ నటించిన క్రూ సినిమా భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఏక్తా కపూర్, అనిల్ కపూర్ నిర్మాతలుగా రూపొందించిన ఈ చిత్రం అంచనాలు మించి కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా కలెక్షన్లు సినీ, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ మూవీ వసూళ్లకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
క్రూ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో టాప్ యాక్టర్లందరూ పనిచేయడం, అలాగే కంటెంట్, క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడంతో ఖర్చు భారీగానే అయింది. ప్రమోషన్స్ ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. మూవీపై ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోవడంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

క్రూ సినిమా ప్రమోషన్స్‌కు ఎక్కువగా బజ్ క్రియేట్ కావడంతో స్టార్ హీరోల మూవీ కంటే ఎక్కువగా థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఈ మూవీని 2000 స్క్రీన్లలో రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమాను మరిన్నీ థియేటర్లలో రిలీజ్ చేస్తూ స్క్రీన్ కౌంట్ పెంచారు. ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో స్క్రీనింగ్ అవుతున్నట్టు సమాచారం.
క్రూ మూవీకి ఓవర్సీస్ మార్కెట్‌లో భారీగా రెస్పాన్స్ వస్తున్నది. ఈ మూవీ నార్త్ అమెరికాలో తొలి రోజు 600K, రెండో రోజు 526K, మూడో రోజు 450K, నాలుగో రోజు 135K, ఐదో రోజు 230K డాలర్లు, ఆరో రోజు 250K డాలర్లు వసూలు చేసింది. అమెరికా మినహాయిస్తే.. మొత్తంగా ఆరు రోజుల్లో ఈ చిత్రం 3 మిలియన్ల డాలర్లు అంటే సుమారుగా 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ఇండియాలో క్రూ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మొదటి రోజు 9.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 10 కోట్ల రూపాయలు, మూడో రోజు 10 కోట్ల రూపాయలు, 4వ రోజు 4 కోట్ల రూపాయలు, ఐదో రోజు 4 కోట్ల రూపాయలు, 6వ రోజు 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ మూవీ మొత్తంగా 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది.
కరీనా కపూర్ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 60 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. అయితే కరీనా లీడ్‌గా నటించిన సినిమాలు హీరోయిన్, వీర్ దే వెడ్డింగ్ చిత్రాలు కూడా భారీగా వసూళ్లను సాధించింది. ఈ మూవీ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుండటంతో కరీనా సత్తా మరోసారి బాక్సాఫీస్ వద్ద బయటపడింది.


Click it and Unblock the Notifications











