40 కోట్ల బడ్జెట్.. కపిల్ శర్మ మూవీకి దారుణంగా కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?

ఇండియాలో టాప్ కామెడీ షో హోస్ట్ కపిల్ శర్మ ప్రధాన పాత్రలో అలనాటి బాలీవుడ్ నటి, స్వర్గీయ రిషి కపూర్ సతీమణి నీతూ కపూర్, రిద్దిమా కపూర్, ఆర్ శరత్ కుమార్, ఆలీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం దాదీ కి షాదీ. ఈ చిత్రంలో సాదిమా కతీబ్, యోగరాజ్ సింగ్, తేజు కొల్హాపూరి తదితరులు నటించారు. ఈ చిత్రాని ఆర్ టేక్ స్టూడయోస్, బీయింగ్ స్టూడియోస్, షిమ్లా టాకిస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై శ్రద్దా అగర్వాల్, అక్షిత్ లహోరియా, గుర్జోత్ సింగ్, గిన్ని కపిల్ శర్మ, కోమల్ సహానీ తదితరులు నిర్మించారు. ఈ చిత్రానికి ఆశీష్ ఆర్ మోహన్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: మార్క్ నుత్కిన్స్, సురేష్ బీసావేణి, ఎడిటర్: ప్రోతిమ్ కౌండ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: గుల్‌రాజ్ సింగ్, మ్యూజిక్: గుల్‌రాజ్ సింగ్, పాయల్ దేవ్, ఆదిత్య దేవ్, గోల్డ్ బాయ్, జియ బారువా తదితరులు తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా మే 8వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ చిత్రం వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Daadi Ki Shaadi Box Office Report

సంపన్న కుటుంబానికి చెందిన టోని కర్లా (కపిల్ శర్మ) వయసు మీద పడుతున్నా పెళ్లి కాని ప్రసాదుగానే ఉంటాడు. అయితే చివరకు పెళ్లి కుదిరే సమయంలో టోని నానమ్మ (నీతూ కపూర్) లేటు వయసులో కెప్టెన్ ఆదివిష్ణు రెడ్డి (ఆర్ శరత్ కుమార్) పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొంటుంది. దాంతో నానమ్మ పెళ్లి చేసుకొంటే టోనితో తమ ఇంటి పెళ్లికి ఒప్పుకోమని అమ్మాయి (సాదిమా కతీబ్) తరుఫు వాళ్లు కండిషన్ పెడుతారు. ఈ క్రమంలో తమ నానమ్మ పెళ్లి చేసుకోవాలనుకొంటున్న వ్యక్తి ఆదివిష్ణు రెడ్డి కాదని తెలుస్తుంది. అసలు ఆదివిష్ణు రెడ్డి (ఆలీ) అని తెలుస్తుంది? లేటు వయసులో టోని నానమ్మ ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకొన్నది? అసలు ఆదివిష్ణురెడ్డి ఎవరు? అతడినే నానమ్మ ఎందుకు పెళ్లి చేసుకోవాలని భావించింది? చివరకు ఈ సమస్యలో ట్విస్టు ఏమిటి? ఇంతకు టోని పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే దాదీ కి షాదీ.

అత్యధిక మంది నటీనటులు, టాలెంటెడ్ టెక్నిషియన్లతో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను అందమైన ప్రదేశాల్లో, లొకేషన్లలో చిత్రీకరించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమా నిర్మాణ వ్యయం సుమారుగా 40 కోట్ల రూపాయల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ల లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

దాదీ కి షాదీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను గానీ, క్రిటిక్స్, సాధారణ ప్రేక్షకులను గానీ ప్రభావం చూపలేకపోయింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు పేలవంగా నమోదు అవుతున్నాయి. ఈ చిత్రం దేశవ్యాప్తంగా నాసిరకమైన కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం తొలి రోజు 60 లక్షల రూపాయలు, రెండో రోజు 1.15 కోట్ల రూపాయలు, మూడో రోజు 1.70 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 50 లక్షలు, ఐదో రోజు 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. గత ఐదు రోజుల్లో 4.45 కోట్ల రూపాయల నెట్, 5.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆరో రోజు సుమారుగా 40 లక్షల రూపాయలు రాబట్ట వచ్చని అంచనా వేస్తు్నారు.

బుల్లితెరపై కామెడీ నైట్స్ షో ద్వారా విశేషమైన పాపులారిటీని, అభిమానులను సంపాదించుకొన్న కపిల్ శర్మ యాక్టర్‌గా సిల్వర్ స్క్రీన్ మీద ఆదరణను సంపాదించుకోలేకపోతున్నాయనే విషయం ఇటీవల ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రుజువు చేశాయి. ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఏదో మ్యాజిక్ జరగాల్సిందే. ఈ సినిమా ఏ మేరకు నష్టాల్లో ముగుస్తుందనే విషయం రాబోయే రోజులు స్పష్టం చేస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X