Daaku Maharaaj Business: బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్.. ఎన్ని కోట్లు కొల్లగొడితే ‘డాకు’ లాభాల్లోకి అంటే?
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా, స్పెషల్ సాంగ్‌లో ఊర్వశి రౌటేలా నటించిన శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రూపొందింది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..
మాస్ ఎలిమెంట్స్‌తో మదర్ సెంటిమెంట్, చైల్డ్ సెంటిమెంట్, యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో బాబీ డియోల్ లాంటి స్టార్ యాక్టర్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ భాగం కావడంతో బడ్జెట్ భారీగానే పెరిగింది. ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.

డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఆంధ్రాలో రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది. ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులు 8.40 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లా హక్కులు 6.30 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కోట్లు, కృష్ణా జిల్లా 5.6 కోట్లు, గుంటూరు 7.2 కోట్లు, నెల్లూరు 2.8 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఆంధ్రాలో 35.3 కోట్లు రూపాయల మేర జరిగింది.
ఇక సీడెడ్ బిజినెస్ విషయానికి వస్తే.. సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న అన్ని సినిమాల్లో కంటే డాకు మహారాజ్ మూవీ అత్యధికంగా బిజినెస్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారుగా 19 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. ఇక నైజాం హక్కులు 21 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా సీడెడ్, నైజాం హక్కులు మొత్తం కలిపి 40 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

డాకు మహారాజ్ సినిమా తెలుగేతర రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటక హక్కులు 4 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 1.5 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ హక్కులు సుమారుగా 83 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.
ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం భారీగానే సెట్ అయింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఈ మూవీ 84 కోట్ల షేర్ 168 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సిందే. సూపర్ హిట్ టాక్ రావాలంటే.. దాదాపు 100 కోట్ల షేర్.. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











