Daaku Maharaaj's Day 8 Collections: ఆగని డాకు మహారాజ్ బాక్సాఫీస్ ఊచకోత.. బాలయ్య మూవీకి ఎన్ని కోట్లంటే?

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బాబీ కొల్లి, స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకెళ్తున్నది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? గత 8 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

డాకు మహారాజ్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ లాంటి టాప్ యాక్టర్లతో థమన్ లాంటి బెస్ట్ టెక్నిషియన్స్‌తో తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.

Daaku Maharaaj s Day 8 Expected Box Office Collections Worldwide Balakrishna Movie crossed Break Even Target

డాకు మహారాజ్ ప్రమోషనల్ ఈవెంట్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు విషయానికి వస్తే.. ఆంధ్ర, నైజాం కలిపి 68 కోట్ల రూపాయలు, ఓవర్సీస్, ఇతర రాష్ట్రాలు కలిపి 16 కోట్ల మేర అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా మొత్తం బిజినెస్ 84 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

బాలకృష్ణ నటించిన ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి ఐదు రోజుల కలెక్షన్ల ఇలా ఉన్నాయి. తొలి రోజు 25.5 కోట్లు, రెండో రోజు 13 కోట్ల రూపాయలు, మూడో రోజు 12 కోట్ల రూపాయలు, 4వ రోజు 10 కోట్ల రూపాయలు, 5వ రోజు 6.5 కోట్ల రూపాయలు, 6వ రోజు 4.5 కోట్లు, 7వ రోజు 4 కోట్ల రూపాయలు నికర కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొదటివారం 75.5 కోట్ల రూపాయలు నమోదు చేసింది.

ఇక 8వ రోజు ఆదివారం ఈ సినిమా గ్రాండ్‌గా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం సుమారుగా 5 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 80 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను నమోదు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సినిమా ఆదివారంతో బ్రేక్ ఈవెన్ సాధించి.. లాభాల జోన్‌లోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు.

Daaku Maharaaj s Day 8 Expected Box Office Collections Worldwide Balakrishna Movie crossed Break Even Target

ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. గత ఏడు రోజుల్లో 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఏపీ, నైజాంలో కలిపి 105 కోట్ల రూపాయల గ్రాస్, ఇతర రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ మార్కెట్‌లో 17 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీగా, నిలకడగా కలెక్షన్లను రాబడుతుండటంతో భారీ లాభాలను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X