Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దబంగ్ 3 ఫస్ట్ డే కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద సల్మాన్ స్టామినా ఎంతంటే.?
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ చిత్రం విడుదలవుతుందంటే.. బాక్సాఫీస్‌కు వణుకు పుట్టాల్సిందే. ఈజీగా వంద కోట్లను కలెక్ట్ చేసే స్టామినా సల్మాన్‌ది. మిగతా యంగ్ హీరోలు, స్టార్స్ వంద కోట్ల క్లబ్‌లోకి వెళ్లాలంటే ఎన్నో ప్రయాసలు పడుతుంటారు. కానీ సల్మాన్ భాయ్ మాత్రం అవలీలగా వంద కోట్లు కొల్లగొట్టేస్తాడు. ఉత్తరాదిన ప్రభంజనం సృష్టించే సల్మాన్.. ఈసారి దక్షిణాదినా కన్నేశాడు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన దబంగ్ 3తో తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో పాగా వేద్దామనుకున్నాడు.
పూర్తిగా సౌత్ ఫ్లేవర్..
దబంగ్ 3ని పూర్తిగా సౌత్ ఫ్లేవర్ తెరకెక్కించడాని టాక్. ప్రభుదేవా తనదైన టేకింగ్‌తో మాస్ ఎంటర్టైనర్గా మలచడంలో సక్సెస్ అయినట్టు కామెంట్లు వినిపిస్తున్నాయి. దబంగ్ 3 అనేది కేవలం సల్మాన్ షో అని రివ్యూలు సైతం తేల్చాయి. సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో రచ్చ చేసిందో చూద్దాం.
తప్పిన అంచనాలు..
దబంగ్ 3 విషయంలో ముందుగా వేసిన అంచనాలు తప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం దాదాపు ముప్పై కోట్లకు పైగా రాబడుతుందని ట్రేడ్ పండితులు భావించినట్టు సమాచారం. అయితే దేశంలో నెలకొన్ని పరిస్థితులు కలెక్షన్లపై ప్రభావం చూపాయని అంటున్నారు.
మొత్తంగా ఎంత రాబట్టిందంటే..?
సల్మాన్ చిత్రానికి కలెక్షన్ల లెక్కలు చూడాలంటే అది మినిమమ్ వంద కోట్ల నుంచి లెక్కలు వేయాల్సిందే. అయితే ఏ చిత్రానికైనా ఫస్ట్ డే కలెక్షన్లు అనేవి.. ప్రాధాన్యంగా మారుతుంటాయి. ఈ విషయంలో దబంగ్ 3 నిరాశ పరిచినా.. లాంగ్ రన్లో కావాల్సిన మొత్తాన్ని రాబడుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25కోట్ల మేర వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది.
దక్షిణాదిపై ప్రభావం చూపని దబంగ్3
కన్నడ, తెలుగు, తమిళంలో స్వయంగా ప్రమోట్ చేసిన సల్మాన్‌కు నిరాశే మిగిలింది. కన్నడ స్టార్ సుదీప్ ఈ చిత్రంలో ఉన్నా గానీ శాండిల్ వుడ్‌లోనూ కలెక్షన్లు ఏమంత చెప్పుకోదగ్గవి కాదని టాక్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం మొదటి రోజు 25 నుంచి 30 లక్షల షేర్ అందుకునే చాన్స్ ఉందని సమాచారం.