Dacoit Overseas Box Office: డెకాయిట్ ఓవర్సీస్ బాక్సాఫీస్ కలెక్షన్లు.. అడివి శేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

తెలుగులో యంగ్ హీరో అడివి శేష్ నటించిన డెకాయిట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సందడి చేస్తున్నది. టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా తొలి ఆట తర్వాత వచ్చిన మిక్స్‌డ్ టాక్‌ను ఎదురించి నిలకడగా వసూళ్లను సాధిస్తున్నదని చిత్ర యూనిట్ అధికారికంగా గత రెండు రోజుల వసూళ్లను వెల్లడించింది. షానీల్ దేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అందాల భామ మృణాల్ థాకూర్, బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం తొలి వారాంతంలో పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకొంటున్నది. ఈ సినిమా నార్త్ అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

లవ్, రొమాంటిక్, యాక్షన్ చిత్రంగా రూపొందిన డెకాయిట్ చిత్రాన్ని ఓవర్సీస్ రైట్స్‌ను మోక్ష మూవీస్ డిస్ట్రిబ్యూటర్ దక్కించుకొన్నది. ఈ సినిమా నార్త్ అమెరికా, ఇతర దేశాల థియేట్రికల్ రైట్స్‌ను సుమారుగా 6 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల్లో టాక్. అయితే ఈ సినిమాపై అంచనాలు, క్రేజ్ ఆడియెన్స్‌లో ఉండటం వల్ల భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా సుమారుగా 7 కోట్ల రూపాయల షేర్.. 14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Dacoit 2 days Overseas Box Office

డెకాయిట్ సినిమా ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడం, అలాగే మృణాల్, శేష్ కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా సానుకూలంగా ప్రారంభమైంది. నార్త్ అమెరికా అంటే కెనడా, యూఎస్‌లో తొలి రోజు గ్రాండ్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. మొదటి రోజు అమెరికాలో 575K డాలర్లు వసూలు చేసింది. రెండో రోజు ఈ సినిమా 760K డాలర్లను రాబట్టింది అని మోక్ష మూవీస్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది అని మోక్ష మూవీస్ ప్రకటించింది. నార్త్ అమెరికా, ఇతర దేశాల్లోని ప్రేక్షకుల ఆదరణ, ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది. ఈ సినిమాను ఆడియెన్స్ బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతీయ కరెన్సీలో ఈ సినిమా సుమారుగా 9.30 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని తెలిపింది. తొలివారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది.

డెకాయిట్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం రెండో రోజు 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలో 16 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్‌ కలెక్షన్లు 9 కోట్లకుపైగా కలెక్షన్లను కలిపితే ఈ చిత్రం 25 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ సమర్ఫణలో సుప్రియా యార్లగడ్డ డెకాయిట్ సినిమాను నిర్మించారు. ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు, సునీల్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు నటించారు. ఈ మూవీ సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫిని, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గ్యానీ బాధ్యతలను నిర్వర్తించారు. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Read more about: dacoit adivi sesh mrunal thakur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X