Dacoit Advance Booking: ఓవర్సీస్‌లో డెకాయిట్ అడ్వాన్స్ బుకింగ్ .. అడివి శేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?
టాలెంటెడ్ హీరో అడివి శేష్, యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం డెకాయిట్. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, రొమాంటిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10వ తేదీన విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మేజర్ తర్వాత అడివి శేష్ నటిస్తోన్న మూవీ కావడంతో పాటు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో డెకాయిట్‌కి అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాపై క్రేజ్ నెలకొంది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో డెకాయిట్ అడ్వాన్స్ బుకింగ్ ఎలా జరుగుతోంది? అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటి వరకు డెకాయిట్‌కు ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి? అనేది పరిశీలిస్తే.
డెకాయిట్ తారాగణం
డెకాయిట్ మూవీకి షానియల్ డియో దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు సంయుక్తంగా డెకాయిట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మారీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అడివి శేష్, షానియల్ డియోలు ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

డెకాయిట్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి డెకాయిట్ మూవీకి 70 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. ప్రమోషనల్ కార్యక్రమాలు, ఈవెంట్ల కోసం భారీగా ఖర్చు చేసి సినిమాపై హైప్ తగ్గకుండా చూసుకుంటూ వచ్చారు.
డెకాయిట్ థియేట్రికల్ బిజినెస్ ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో డెకాయిట్ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 3 కోట్ల రూపాయలు చొప్పున ఆంధ్రా- నైజాంలలో డెకాయిట్‌కు 20 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 3.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 6.5 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా డెకాయిట్ మూవీకి 30 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో అడివి శేష్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 32 కోట్ల రూపాయల షేర్.. 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ఈవెన్ టార్గెట్ నిర్దేశించారు.
డెకాయిట్ అడ్వాన్స్ బుకింగ్
డెకాయిట్ మూవీ ఓవర్సీస్ హక్కులను మోక్ష మూవీస్ సొంతం చేసుకుంది. ప్రీమియర్స్‌తో పాటు సినిమా ప్రదర్శనకు ఈ సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు తగినట్లుగానే డెకాయిట్ అడ్వాన్స్ బుకింగ్‌కు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 9వ తేదీన ప్రదర్శించే ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో 342 సెంటర్స్‌లో 738 షోలకు గాను ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్‌లో 13456 టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా 216,438 డాలర్లు (2 కోట్ల రూపాయలకు పైగా) వసూలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మేజర్ రికార్డ్‌పై డెకాయిట్ కన్ను
అడివి శేష్ మూవీ నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ 300K డాలర్లు (2.77 కోట్ల రూపాయలు) దాటించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అడవి శేష్ గత చిత్రం మేజర్ నార్త్ అమెరికాలో 270K డాలర్లు (2.50 కోట్ల రూపాయలు)తో ఉంది. దీనిని డెకాయిట్‌తో అధిగమించాలని శేష్ పట్టుదలతో ఉన్నాడు. మరి డెకాయిట్ ఎలాంటి మేజిక్ చేస్తుందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications


















