Dacoit Day 1 Collections: డెకాయిట్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అడివి శేష్ మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

Dacoit Box Office Collection: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్,బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్ (Dacoit). ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్ కాంబోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లతో మంచి అంచనాలు రేకెత్తించింది. ముఖ్యంగా 'మేజర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అడివి శేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో డెకాయిట్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
అప్పుడు పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ… ఇప్పుడు విజయ్ దళపతి .. పైరసీ వేటుకు బలి!
అప్పుడు పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ… ఇప్పుడు విజయ్ దళపతి .. పైరసీ వేటుకు బలి!

డెకాయిట్ మూవీకి షానీ డియో దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ బ్యానర్లపై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నటీనటుల పరంగా కూడా సినిమా బలంగా ఉంది. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. టెక్నికల్‌గా కూడా సినిమా స్ట్రాంగ్ టీమ్‌తో రూపొందించబడింది. అడివి శేష్, షానీల్ డియోలు ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Dacoit Day 1 Expected Box Office Collections Worldwide Adivi Sesh Film Opening Box Office Report
Recommended For You
Monalisa: ఊహించని ట్విస్ట్.. కుంభమేళ మోనాలిసాకు బిగ్ షాక్.. భర్తపై ఆ కేసు..
Monalisa: ఊహించని ట్విస్ట్.. కుంభమేళ మోనాలిసాకు బిగ్ షాక్.. భర్తపై ఆ కేసు..

ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే... 'డెకాయిట్' సినిమాకు సుమారు రూ.70 కోట్ల వరకు ఖర్చు అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నటినటుల రెమ్యూనరేషన్, ప్రొడక్షన్ ఖర్చులు, భారీ ప్రమోషన్స్‌కు చేసిన ఖర్చు కూడా కలిపి ఈ మొత్తం చేరినట్లు సమాచారం. సినిమా రిలీజ్‌కు ముందు నుంచే మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా నిర్వహించేందుకు హైప్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఇక డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా 'డెకాయిట్'మంచి రేంజ్‌లో డీల్స్ కుదుర్చుకున్నట్లు. హిందీ మార్కెట్‌లో ఈ సినిమాని ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ PVR INOX Pictures విడుదల చేస్తుండగా, నైజాం ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఓవర్సీస్ మార్కెట్‌లో మోక్ష మూవీస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.

You May Also Like
Dacoit Movie Public Talk: 'డెకాయిట్' పబ్లిక్ టాక్.. అడివి శేషు సినిమా ఎలా ఉందంటే..?
Dacoit Movie Public Talk: 'డెకాయిట్' పబ్లిక్ టాక్.. అడివి శేషు సినిమా ఎలా ఉందంటే..?

థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి డిమాండ్ కనిపించింది. ఆంధ్రాలో రూ.10 కోట్లు, నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్లు కలిపి మొత్తం రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మరో రూ.10 కోట్ల వరకు బిజినెస్ జరిగిన సమాచారం. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా డెకాయిట్ సినిమాకు మొత్తం రూ.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.32 కోట్ల షేర్, దాదాపు రూ.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.

Raaka: అల్లు అర్జున్ సినిమా కోసం రష్మిక కళ్లుచెదిరే రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?
Raaka: అల్లు అర్జున్ సినిమా కోసం రష్మిక కళ్లుచెదిరే రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?

ఇక డెకాయిట్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీగా ప్రమోషన్స్ చేసినప్పటికీ... బాక్సాఫీస్ వద్ద మాత్రం మొదటి రోజు మాత్రం మిక్స్డ్ అందుకుంది. సినిమా రిలీజ్‌కు ముందు నుంచే డెకాయిట్ కు పెద్దగా బజ్ లేదనే విషయం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా స్పష్టమతుంది. అన్ని ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ సినిమా కేవలం 25 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడవ్వడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. భారీ అంచనాలతో వచ్చిన డెకాయిట్ మాత్రం స్లో స్టార్ట్ కావడం.. ఓపెనింగ్ కలెక్షన్లపై నేరుగా ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలిని మించేలా అట్లీ ప్లాన్ !
అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలిని మించేలా అట్లీ ప్లాన్ !

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో డెకాయిట్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. రిలీజ్‌కు ముందే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇప్పటివరకు 216,438 డాలర్ల కలెక్షన్లు (రూ. 1.80 కోట్లు) నమోదయ్యాయి. మొత్తం 342 లొకేషన్స్‌లో 738 షోలు ప్లాన్ చేయగా, ఇప్పటికే 13,456 టికెట్లు అమ్ముడవడం విశేషం. ఈ సంఖ్యలు చూస్తుంటే.. సినిమా ప్రీమియర్ డే నాటికి కలెక్షన్లు 325K డాలర్లు (రూ.2.70 కోట్లు)పైగా వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్.. 'మహావతార్' స్పూర్తితో భారీ ప్లాన్!
అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్.. 'మహావతార్' స్పూర్తితో భారీ ప్లాన్!

ఈ ఓపెనింగ్స్‌తో హీరో అడవి శేషు తన కెరీర్‌లో మరో రికార్డ్ సెట్ చేయబోతున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు ఆయన నటించిన 'మేజర్’ సినిమా యూఎస్ ప్రీమియర్స్ ద్వారా సుమారు 270K డాలర్లు (రూ.2.24 కోట్లు)వసూలు చేసి కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. ముఖ్యంగా యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ఓవర్సీస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Sudigali Sudheer: ఆమెతో 14 ఏళ్ల రిలేషన్.. ఆ విషయం తట్టుకోలేక నడిరోడ్డుపై అలా..
Sudigali Sudheer: ఆమెతో 14 ఏళ్ల రిలేషన్.. ఆ విషయం తట్టుకోలేక నడిరోడ్డుపై అలా..

ట్రేడ్ వర్గాల ప్రకారం.. డెకాయిట్ మూవీ తొలి రోజు (డే 1) ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.4కోట్ల నుంచి 4.5 కోట్ల నెట్ మార్క్‌ అందుకునే అవకాశముందని అంచనా. ఇక ఓవర్సీస్ 2 కోట్ల వరకు అందుకునే అవకాశముందని అంచనా. ఈ లెక్కన చూస్తే.. డెకాయిట్ మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6 కోట్ల నుంచి 6.5 కోట్లు వరకు అందుకునే అంచనా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్ల పరంగా డబుల్ డిజిట్ ఓపెనింగ్ అందుకునే అవకాశాలు తక్కువేనని చెప్పాలి.

'ఆ హీరోతో పిల్లలను కనాలనుకున్నా.. వాళ్ల వల్లే మా పెళ్లి కాలేదు'
'ఆ హీరోతో పిల్లలను కనాలనుకున్నా.. వాళ్ల వల్లే మా పెళ్లి కాలేదు'

దీంతో మేకర్స్ ఆశించిన పాన్ ఇండియా రేంజ్ స్టార్ట్ అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఇకపై మరో వైపు రణ్ వీర్ సింగ్ ధురంధర్ 2.. నాలుగో వారంలో కూడా ఈ సినిమా రోజుకు సుమారు రూ. 7 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటికే 1600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా డెకాయిట్ పై ప్రభావం చూపుతోందనే చెప్పాలి.

నల్లగా పుట్టడం నా తప్పా ? బాడీ షేమింగ్ కామెంట్స్ పై బజర్థస్త్ నటి ఆవేదన
నల్లగా పుట్టడం నా తప్పా ? బాడీ షేమింగ్ కామెంట్స్ పై బజర్థస్త్ నటి ఆవేదన

ఈ నేపథ్యంలో డెకాయిట్ మూవీ సక్సెస్ అనేది పూర్తిగా ప్రేక్షకుల స్పందనపై ఆధారపడి ఉంది. సినిమా కంటెంట్ బలంగా ఉంటే... ఆఫ్‌వర్డ్ మౌత్ ద్వారా వీకెండ్‌లో పుంజుకునే అవకాశం ఉంది. లేకపోతే మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో కొత్తదనం చూపించగలిగితేనే ఈ సినిమా నిలబడగలదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'ధురంధర్ 2' తో పోటీ పడుతున్న ఈ సినిమా హిట్ అవుతుందా? లేక సాధారణ రన్తో సరిపెట్టుకుంటుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X