Dacoit Day 10 Collections: వీకెండ్‌లో ‘డెకాయిట్' వీరంగం.. అడివి శేషు మూవీకి ఎన్ని కోట్లంటే?

Dacoit Box Office Collection: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ (Dacoit)సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ తర్వాత ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం స్ట్రాంగ్ కలెక్షన్స్ అందుకుంటుంది. ముఖ్యంగా ఓపెనింగ్ వీకెండ్‌లో మంచి వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మౌత్ టాక్ పెరుగుతుండటంతో రోజురోజుకు కలెక్షన్లు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇక వీకెండ్ లో మరోసారి డెకాయిట్ మూవీ వీరంగం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో డెకాయిట్ ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? 10వ రోజు అంచనా కలెక్షన్లు ఎంతంటే?

ఈ చిత్రాన్ని దర్శకుడు షానెయిల్ డియో తెరకెక్కించగా,అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌ల నిర్మాణంలో రూపొందించారు. సుమారు రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.30 కోట్ల వరకు జరిగినప్పటికీ, అసలు గేమ్ మాత్రం నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే వచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు, శాటిలైట్ రైట్స్ రూపంలో దాదాపు రూ.48 కోట్ల వరకు రికవరీ సాధించడం నిర్మాతలకు పెద్ద రిలీఫ్‌గా మారింది. దీంతో థియేటర్ల ద్వారా కేవలం రూ.17 కోట్ల షేర్ వచ్చినా సరిపోతుందనే పరిస్థితి ఏర్పడింది. అదే ఇప్పుడు ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. ఎందుకంటే విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఆ టార్గెట్‌ను ఈ చిత్రం దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఓపెనింగ్ వీకెండ్ ముగిసే సరికి నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు.

Dacoit Day 10 Expected Box Office Collections Worldwide Adivi Sesh Film Box Office Report

రోజువారీ కలెక్షన్ల పరంగా చూస్తే డెకాయిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద శుభఆరంభాన్ని నమోదు చేసింది. రిలీజ్ రోజునే ఈ సినిమా రూ.6.55 కోట్ల నెట్ వసూళ్లు సాధించి డీసెంట్ ఓపెనింగ్ అందుకుంది. రెండో రోజు శనివారం పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా కలెక్షన్లు మరింత పెరిగి రూ.6.85 కోట్లకు చేరాయి. ఆదివారం కూడా మంచి ఆక్యుపెన్సీ కొనసాగడంతో రూ.6.40 కోట్ల నెట్ రాబట్టింది. ఇలా తొలి మూడు రోజుల్లోనే సినిమా స్ట్రాంగ్ ట్రెండ్ చూపిస్తూ భారీ ఓపెనింగ్ వీకెండ్‌ను సొంతం చేసుకుంది. అయితే వీకెండ్ ముగిసిన తర్వాత సాధారణంగా కనిపించే డ్రాప్ ఈ సినిమాకూ కనిపించింది. సోమవారం నుంచి కలెక్షన్లు క్రమంగా తగ్గాయి.నాలుగో రోజు రూ.2.70 కోట్లు, ఐదో రోజు రూ.3.00 కోట్లు, ఆరో రోజు రూ.1.55 కోట్లు, ఏడో రోజు రూ.1.40 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.02 కోట్ల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో పడిపోకుండా స్టడీగా కొనసాగడం ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది.

ఇక తొమ్మిదో రోజు ఈ సినిమాకు మళ్లీ బూస్ట్ లభించింది. రెండో వీకెండ్ రావడంతో కలెక్షన్లు మరోసారి పుంజుకున్నాయి. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, 9వ రోజు 'డెకాయిట్' భారతదేశంలో రూ.1.15 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇది అంతకుముందు రోజు వచ్చిన రూ.1.02 కోట్ల నెట్ కలెక్షన్లతో పోలిస్తే పెరుగుదల నమోదైనట్లు చెబుతున్నారు. వీక్‌డేస్‌లో కొంత స్లో అయినా, వీకెండ్‌లో మళ్లీ గ్రోత్ చూపించడం సినిమాకు ప్లస్‌గా మారింది. ఇప్పటివరకు ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.30.50 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. అదే సమయంలో ఇండియా గ్రాస్ వసూళ్లు రూ.35.49 కోట్లకు చేరుకున్నాయి. అడివి శేష్ మార్కెట్‌కు తగ్గట్టుగానే ఈ సంఖ్యలు బలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. విదేశీ మార్కెట్‌లో ఇప్పటివరకు రూ.12.80 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా 'డెకాయిట్' మొత్తం రూ.48.29 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుంది.

ఇక పదో రోజు (డే 10) అంచనా కలెక్షన్ల విషయానికి వస్తే డెకాయిట్ సినిమాకు వీకెండ్ అడ్వాంటేజ్ బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. శని, ఆదివారాల్లో ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉండటంతో కలెక్షన్లు మళ్లీ పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం విడుదలైన ఇతర సినిమాలు మిక్స్‌డ్ టాక్ అందుకోవడం కూడా 'డెకాయిట్'కు అదనపు ప్లస్‌గా మారే అవకాశం ఉంది. తాజా అంచనాల ప్రకారం.. పదో రోజు భారతదేశ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్య నెట్ వసూళ్లు సాధించే అవకాశముంది. ఇదే సమయంలో ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మంచి స్పందన కొనసాగే అవకాశం ఉండటంతో సుమారు రూ.50 లక్షల వరకు గ్రాస్ రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఇండియా గ్రాస్ కలెక్షన్లు త్వరలోనే రూ.38 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక విదేశీ వసూళ్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రెండో వీకెండ్‌లో మంచి జంప్ వస్తే ఈ మైలురాయి మరింత వేగంగా చేరుకునే అవకాశముంది. మరోవైపు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని ప్రకటించింది. సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేస్తూ దీనిని గ్రాండ్ సక్సెస్‌గా పేర్కొంది. దీంతో ట్రేడ్ లెక్కలు, మేకర్స్ లెక్కలపై కూడా చర్చ సాగుతోంది. మొత్తానికి డెకాయిట్ మూవీ లాభాల్లో దూసుకెళ్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X