Dacoit Day 11 Collections: వీకెండ్‌లో డెకాయిట్ జోరు... అడివి శేష్ మూవీ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

Dacoit Box Office Collection: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్ తర్వాత ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం స్టెడీగా కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా ఓపెనింగ్ వీకెండ్‌లో మంచి వసూళ్లు నమోదు చేసి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ప్రేక్షకుల నుంచి మౌత్ టాక్ కూడా క్రమంగా పెరుగుతుండటంతో సినిమాకు మంచి హోల్డ్ కనిపిస్తోంది. వీకెండ్ రోజుల్లో డెకాయిట్ మరోసారి జోరు చూపిస్తుండగా, వీక్‌డేస్‌లో మాత్రం కలెక్షన్స్ కొంత తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డెకాయిట్ ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? 11వ రోజు అంచనా కలెక్షన్లు ఎంతంటే?

ఈ చిత్రానికి దర్శకుడు షానెయిల్ డియో దర్శకత్వం వహించగా, అన్న పూర్ణ సూడియోస్ సమర్పణలో ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్ నిర్మించారు. సుమారు రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.30 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. అయితే అసలు లాభాల గేమ్ మాత్రం నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్ హక్కుల రూపంలో ఈ సినిమాకు దాదాపు రూ.48 కోట్ల వరకు రికవరీ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో థియేటర్ల ద్వారా కేవలం రూ.17 కోట్ల షేర్ వచ్చినా నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

Dacoit Day 11 Expected Box Office Collections Worldwide Adivi Sesh Film Box Office Report

ఇదే ఇప్పుడు ఈ సినిమాకు పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది.ఆశ్చర్యకరంగా విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఆ టార్గెట్‌ను డెకాయిట్ దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓపెనింగ్ వీకెండ్ ముగిసే సరికి నిర్మాతలు ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో థియేటర్లలో వచ్చే తదుపరి వసూళ్లు నేరుగా లాభాలుగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రోజువారీ కలెక్షన్ల పరంగా చూస్తే డెకాయిట్ మూవీ బాక్సాఫీస్ వద్ద శుభారంభం నమోదు చేసింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా రూ.6.55 కోట్ల నెట్ వసూళ్లు సాధించి డీసెంట్ ఓపెనింగ్ అందుకుంది. రెండో రోజు శనివారం పాజిటివ్ మౌత్ టాక్‌తో కలెక్షన్లు మరింత పెరిగి రూ.6.85 కోట్లకు చేరాయి. ఆదివారం కూడా మంచి ఆక్యుపెన్సీ కొనసాగడంతో రూ.6.40 కోట్ల నెట్ రాబట్టింది. ఇలా తొలి మూడు రోజుల్లోనే సినిమా స్ట్రాంగ్ ట్రెండ్ చూపిస్తూ భారీ ఓపెనింగ్ వీకెండ్‌ను సొంతం చేసుకుంది. అయితే వీకెండ్ ముగిసిన తర్వాత సాధారణంగా కనిపించే డ్రాప్ ఈ సినిమాకూ కనిపించింది. నాలుగో రోజు సోమవారం రూ.2.70 కోట్లు, ఐదో రోజు రూ.3.00 కోట్లు, ఆరో రోజు రూ.1.55 కోట్లు, ఏడో రోజు రూ.1.40 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.02 కోట్లు వసూలు చేసింది. అయితే తొమ్మిదో రోజు మళ్లీ కొంత పుంజుకుని రూ.1.15 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుంది.

పదో రోజు వీకెండ్ ఎఫెక్ట్‌తో మరోసారి గ్రోత్ చూపిస్తూ రూ.1.46 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు డెకాయిట్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.32.06 కోట్ల నెట్ కలెక్షన్ నమోదు చేసింది. అదే సమయంలో ఇండియా గ్రాస్ వసూళ్లు రూ.37.30 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. విదేశీ మార్కెట్‌లో ఇప్పటివరకు రూ.13.30 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా డెకాయిట్ మూవీ మొత్తం రూ.50.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుని సక్సెస్ రన్ కొనసాగిస్తోంది.

ఇక 11వ రోజు అంచనా కలెక్షన్ల విషయానికి వస్తే, రెండో వీకెండ్‌లో జోరు చూపించిన ఈ సినిమా, ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, 11వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అదే సమయంలో ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య కలెక్షన్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.ఈ ట్రెండ్ కొనసాగితే ఇండియా గ్రాస్ త్వరలోనే రూ.38 కోట్ల మార్క్ దాటే అవకాశముంది. విదేశీ వసూళ్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.52 కోట్లకు చేరువ కానుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమా లాభాల బాటలో దూసుకెళ్తూ మంచి రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా ద్వారా అడివి శేష్ బాక్సాఫీస్ స్టామినాను చూపించడమే కాకుండా తన ఖాతాలో భారీ సక్సెస్‌ను వేసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X