Dacoit Day 2 Collections: ‘డెకాయిట్' బాక్సాఫీస్ బ్లాస్ట్.. అడివి శేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Dacoit Box Office Collection: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్ (Dacoit). ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్ కాంబోగా తెరకెక్కిన ఈ సినిమాకి తొలి షో నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం యూత్ ఆడియన్స్ మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో డెకాయిట్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? రెండు రోజు అంచనా కలెక్షన్లు ఎంతంటే?

డెకాయిట్ మూవీకి షానీ డియో దర్శకత్వం వహించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు సంయుక్తంగా నిర్మించారు. కథ, స్క్రీన్‌ప్లేను అడివి శేష్‌తో పాటు దర్శకుడు స్వయంగా అందించగా, డైలాగ్స్‌ను అబ్బూరి రవి రాశారు. సినిమాటోగ్రఫీని ధనుష్ భాస్కర్ నిర్వహించగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు. ఎడిటింగ్ బాధ్యతలను కోదాటి పవన్ కళ్యాణ్ చేపట్టారు. నటీనటుల పరంగా కూడా ఈ సినిమా బలంగా నిలిచింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, అలాగే అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించడం సినిమాకు మరింత బలం చేకూర్చింది.

Dacoit Day 2 Expected Box Office Collections Worldwide Adivi Sesh Film Box Office Report

బడ్జెట్ విషయానికి వస్తే, 'డెకాయిట్' సినిమా దాదాపు రూ.70 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి థియేట్రికల్ డిమాండ్ కనిపించింది. ఆంధ్రా ప్రాంతంలో సుమారు రూ.10 కోట్ల బిజినెస్, నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్లు కలిపి మొత్తం రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ నమోదైంది. ఇక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మరో రూ.10 కోట్ల వరకు బిజినెస్ జరిగి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం, 'డెకాయిట్' సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.32 కోట్ల షేర్, దాదాపు రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.

ఇక కలెక్షన్ల పరంగా డెకాయిట్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్ నమోదు చేసింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. విడుదలైన మొదటి రోజున ఈ సినిమా సుమారు 3,800 షోలలో ప్రదర్శింపబడుతూ ఇండియాలో రూ. 6.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, దేశవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ రూ.7.57 కోట్లకు చేరాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. విదేశాల్లో సుమారు రూ.6.00 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడంతో, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 13.57 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా భారీ ఓపెనింగ్ అందుకుంది. సుమారు రూ. 5.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా, కర్ణాటకలో రూ. 80 లక్షలు, మిగతా భారతదేశంలో రూ. 1.10 కోట్ల వరకు వసూళ్లు నమోదయ్యాయి. తమిళనాడు, కేరళలో మాత్రం స్పందన చాలా తక్కువగా ఉంది. కేవలం రూ.17 లక్షల మాత్రమే రాబట్టింది.మొదటి రోజు నుంచే ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. మూవీ మేకర్స్ మాత్రం రూ. 15 కోట్లకు పైగా వసూలు సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇక రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. నేడు వీకెండ్ కావడంతో ఓపెన్సింగ్స్ రాగానే డే 2 కూడా భారీ కలెక్షన్స్ అందుకునే అవకాశముందట. సినిమా ఆక్యుపెన్సీ విషయంలో తెలుగు వెర్షన్ లో పెరుగుదల కనిపిస్తోంది. ఉదయం షోలు 30.54% ఆక్యుపెన్సీతో ప్రారంభమై, రాత్రి షోల వరకు 55% వరకు పెరగడం గమనార్హం. ముఖ్యంగా హైదరాబాద్‌లో 353 షోలతో 60.3% ఆక్యుపెన్సీ నమోదు కావడం సినిమా రన్‌కు బలం చేకూర్చింది. ఈ లెక్కన ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 6 నుంచి 7 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందట. ఓవర్సీస్ లో కూడా 2 కోట్లకు పైగా వసూలు అందుకునే అవకాశముందట.

అడివి శేష్ గత సినిమాలతో పోలిస్తే 'డెకాయిట్' స్ట్రాంగ్ ఓపెనింగ్ అందుకుంది. 'HIT 2' మొదటి రోజు సుమారు రూ. 6.4 కోట్లను మాత్రమే రాబట్టగా, 'డెకాయిట్' దానిని దాటింది. అలాగే 'మేజర్' సినిమాతో పోలిస్తే కూడా ఇది మంచి స్టార్ట్ అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మృణాల్ ఠాకూర్‌కు కూడా ఇది ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల కంటే మెరుగైన ఓపెనింగ్‌గా నిలిచింది. మొత్తంగా చూస్తే, 'డెకాయిట్' సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకోవడంతో రెండో రోజు వసూళ్లు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలా వీకెండ్ కలెక్షన్స్ ఈ సినిమాకు కీలకం కానున్నాయి. మంచి మౌత్ టాక్ వస్తే సినిమా ఇంకా పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X