Dacoit Day 4 Collections: డెకాయిట్ కు అద్దిరిపోయే కలెక్షన్లు.. అడివి శేష్ మూవీకి ఎన్ని కోట్లంటే ?

Dacoit Box Office Collection: టాలీవుడ్ టాలెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్ (Dacoit). ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా 10వ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్,యాక్షన్, ఫ్యామిలీ, రొమాన్స్ ఎలిమెంట్స్ తో రూపొందించిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ సొంతం చేసుకుంది. టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ సినిమా, రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కొనసాగుతోంది. మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా స్టేబుల్‌గా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో డెకాయిట్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? నాలుగోవ రోజు అంచనా కలెక్షన్లు ఎంతంటే?

డెకాయిట్ దర్శకత్వం వహించినది షానెల్ డియో. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు నిర్మించారు. కథ, స్క్రీన్‌ప్లేలో అడివి శేష్ స్వయంగా భాగస్వామ్యం కావడానికి ప్రత్యేకతగా నిలిచింది. డైలాగ్స్‌ను అబ్బూరి రవి అందించారు. సినిమాటోగ్రఫీ ధనుష్ భాస్కర్, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు. ఎడిటింగ్‌లను బాధ్యత కోదాటి పవన్ కళ్యాణ్ చేసారు. కాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా నిలిచింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, అలాగే అతుల్ కులకర్ణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించి సినిమాకు మరింత బలం చేకూర్చారు.

Dacoit Day 4 Expected Box Office Collections Worldwide Adivi Sesh Film Box Office Report

బడ్జెట్ విషయానికి వస్తే, ఈ సినిమా దాదాపు రూ.70 కోట్ల వ్యయంతో తెరకెక్కినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే, తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.20 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇందులో ఆంధ్ర ప్రాంతం నుంచి రూ.10 కోట్లు, నైజాం నుంచి రూ.7 కోట్లు, సీడెడ్ నుంచి రూ.3 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మరో రూ.10 కోట్ల వరకు బిజినెస్ జరగడంతో, మొత్తం వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.30 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కల ప్రకారం.. డెకాయిట్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.32 కోట్ల షేర్‌ను వసూలు చేయాలి. గ్రాస్ కలెక్షన్ల పరంగా చూస్తే దాదాపు రూ.65 కోట్ల మార్క్‌ను అందుకోవాలి.

డెకాయిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీకి మొదటి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్ల విషయంలో మాత్రం స్టెడీగా కొనసాగడం విశేషం. మొదటి రోజు (శుక్రవారం) ఈ సినిమా రూ.6.55 కోట్ల వసూళ్లు సాధించింది. రెండో రోజు (శనివారం) ప్రేక్షకుల స్పందన కొంత మెరుగవడంతో కలెక్షన్లు రూ.6.85 కోట్లకు చేరాయి. ఇక ఆదివారం రోజు కూడా మంచి ఆక్యుపెన్సీతో రూ.6.40 కోట్లు రాబట్టింది. ఈ విధంగా మొదటి మూడు రోజుల్లోనే సినిమా దాదాపు రూ.20 కోట్లకు చేరువలో నెట్ కలెక్షన్లు సాధించడం గమనార్హం.

ప్రాంతాల వారీగా చూస్తే, తెలుగు వెర్షన్‌కు మంచి ఆదరణ లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.15.75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అదే సమయంలో హిందీ వెర్షన్ కూడా అనుకున్నదానికంటే మెరుగైన ప్రదర్శన కనబరిచి రూ.4.05 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. మొత్తం కలెక్షన్ల పరంగా చూస్తే.. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.34.77 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయగా.. అందులో ఇండియా గ్రాస్ రూ.23.12 కోట్లు కాగా, ఇండియా నెట్ రూ.19.80 కోట్లుగా నమోదైంది.

ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ కూడా రూ.11.65 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ రేంజ్ కలెక్షన్లు చూస్తే సినిమాపై ఉన్న క్రేజ్‌ ఎంతో అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నిర్మాత అన్నపూర్ణ స్టూడియోస్ ఇక 3 రోజుల్లో రూ.40 కోట్ల గ్రాస్ అందుకుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఓపెనింగ్ వీకెండ్‌తో డెకాయిట్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిందంటూ కామెంట్స్ చేశారు.

ఇక నాలుగు కలెక్షన్లు విషయానికి వస్తే.. డే 4 ( సోమవారం) వర్కింగ్ డే కాబట్టి, కలెక్షన్స్ తగ్గే అవకాశముంది. ఈ లెక్కన ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఇండియా బాక్సాఫీస్ వద్ద డే 4 నాడు రూ.5 నుంచి 6 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందట. ఓవర్సీస్ లో 80 లక్షలు నుంచి 1కోటిలోపు వసూలు అందుకునే అవకాశముందట. ఈ లెక్కన చూస్తే.. ఇండియా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.30 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ.40 కోట్ల నుంచి రూ.42 కోట్ల వరకు చేసుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X