Dacoit Day 5 Collections: తగ్గిన డెకాయిట్ జోరు.. అడివి శేష్ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటంటే?

Dacoit Box Office Collection: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్ (Dacoit) సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్, యాక్షన్, ఫ్యామిలీ, రొమాన్స్ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచిన ఈ చిత్రం, విడుదల తర్వాత మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్టెడీ కలెక్షన్లతో కొనసాగుతోంది. ముఖ్యంగా అడివి శేష్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డెకాయిట్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఐదో రోజు అంచనా కలెక్షన్లు ఎంతంటే?

డెకాయిట్ (Dacoit)మూవీకి దర్శకత్వం వహించినది షానెల్ డియో. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు నిర్మించారు. కథ, స్క్రీన్‌ప్లేలో అడివి శేష్ భాగస్వామ్యం కావడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డైలాగ్స్‌ను అబ్బూరి రవి అందించగా, సినిమాటోగ్రఫీ ధనుష్ భాస్కర్, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో సమకూర్చారు. ఎడిటింగ్‌ను కోదాటి పవన్ కళ్యాణ్ నిర్వహించారు. కాస్టింగ్ పరంగా కూడా సినిమా బలంగా నిలిచింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, అలాగే అతుల్ కులకర్ణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించి సినిమాకు మరింత వెయిట్ తీసుకొచ్చారు.

Dacoit Day 5 Expected Box Office Collections Worldwide Adivi Sesh Film Box Office Report

బడ్జెట్ విషయానికి వస్తే, డెకాయిట్ సినిమా సుమారు రూ.70 కోట్ల వ్యయంతో తెరకెక్కినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇందులో ఆంధ్ర ప్రాంతం నుంచి సుమారు రూ.10 కోట్లు, నైజాం నుంచి రూ.7 కోట్లు, సీడెడ్ నుంచి రూ.3 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ.10 కోట్ల వరకు బిజినెస్ జరగగా, మొత్తం వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.30 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కల ప్రకారం, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.32 కోట్ల షేర్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది. గ్రాస్ పరంగా చూస్తే దాదాపు రూ.65 కోట్ల మార్క్‌ను అందుకోవాలి.

ఇక డెకాయిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్‌తో స్టెడీ రన్ కొనసాగిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌కు మొదటి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, స్టెబుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు శుక్రవారం రూ.6.55 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా, శనివారం ప్రేక్షకుల స్పందన మెరుగవడంతో రూ.6.85 కోట్లకు పెరిగింది. ఆదివారం కూడా మంచి ఆక్యుపెన్సీతో రూ.6.40 కోట్లు రాబట్టి ఓపెనింగ్ వీకెండ్‌లో సాలిడ్ కలెక్షన్స్ అందుకుంది.

అయితే సోమవారం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లు తగ్గి,డే 4 నాడు సుమారు రూ.2.70 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే నమోదు చేసింది. Sacnilk అంచనాల ప్రకారం.. మొత్తం దేశీయ వసూళ్లు ఇప్పటివరకు రూ.22.50 కోట్లకు చేరాయి. ఈ డ్రాప్ సాధారణమేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి, ఎందుకంటే అసలు పరీక్ష వర్కింగ్ డేస్‌లోనే ఉంటుందని అంటున్నారు.

ప్రాంతాల వారీగా చూస్తే, తెలుగు వెర్షన్‌కు మంచి ఆదరణ లభించింది. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.17.85 కోట్ల నెట్ కలెక్షన్లు రావడం విశేషం. హిందీ వెర్షన్ కూడా ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శన కనబరిచి రూ.4.65 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. మొత్తంగా చూస్తే, డెకాయిట్ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకు సుమారు రూ.37.49 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అందులో ఇండియా గ్రాస్ రూ.26.24 కోట్లు కాగా, ఇండియా నెట్ రూ.22.50 కోట్లుగా నమోదైంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. అక్కడే సుమారు రూ.11.65 కోట్ల గ్రాస్ రాబట్టడం సినిమాపై ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఇదిలా ఉంటే, మూవీ టీమ్ మాత్రం మొదటి మూడు రోజుల్లోనే రూ.40 కోట్ల గ్రాస్ అందుకున్నామని ప్రకటించడం విశేషం.

ఇక డే 5 (Day 5) కలెక్షన్ల విషయానికి వస్తే, వర్కింగ్ డే ప్రభావంతో వసూళ్లు మరింత తగ్గే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో డే 5 నాడు ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.2.5 నుంచి రూ.3 కోట్ల మధ్య నెట్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే, ఐదు రోజుల ముగింపుకు ఇండియా గ్రాస్ సుమారు రూ.30 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం కలెక్షన్లు రూ.40 కోట్ల నుంచి రూ.42 కోట్ల మధ్యకు చేరుకునే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక వీక్‌డేస్‌లో కూడా ఇదే స్థాయిలో స్టెడీగా కొనసాగితే, బ్రేక్ ఈవెన్ దిశగా డెకాయిట్ ప్రయాణం సాఫీగా సాగుతుందని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X