Dacoit Day 6 Collections: డెకాయిట్ కలెక్షన్లు డౌన్.. అడివి శేష్ మూవీకి 6వ రోజు ఎన్ని కోట్లంటే?

Dacoit Box Office Collection: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్ (Dacoit). ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్, యాక్షన్, ఫ్యామిలీ, రొమాన్స్ అంశాల మేళవింపుతో రూపొందించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. విడుదల తర్వాత మిక్స్‌డ్ టాక్ వచ్చినా, ప్రారంభ వీకెండ్‌లో మాత్రం కలెక్షన్ల జోరు కనిపించింది. ఇప్పటికే లాభాల బాటలో ప్రయాణిస్తుంది. అయితే, వర్కింగ్ డేస్‌లోకి వచ్చేసరికి ఆ జోరు తగ్గిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో డెకాయిట్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఆరో రోజు అంచనా కలెక్షన్లు ఎంతంటే?

Also Read
అందుకు ఎవరితోనైనా పడుకొంటాను.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
అందుకు ఎవరితోనైనా పడుకొంటాను.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

డైరెక్టర్ షానెల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు ఈ మూవీని నిర్మించారు. కథ, స్క్రీన్‌ప్లేలో స్వయంగా అడివి శేష్ భాగస్వామ్యం కావడం ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది. డైలాగ్స్‌ను అబ్బూరి రవి అందించారు, సినిమాటోగ్రఫీని ధనుష్ భాస్కర్ చేసారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, ఎడిటింగ్ బాధ్యతలను కోదాటి పవన్ కళ్యాణ్ చేసారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, అలాగే అతుల్ కులకర్ణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. వీరి నటన సినిమాకు మరింత బలం చేకూర్చింది.

Recommended For You
బికినీలో కరీనా కపూర్‌లా చూపిస్తామంటూ.. వివాదంపై నోరు విప్పిన ప్రియమణి
బికినీలో కరీనా కపూర్‌లా చూపిస్తామంటూ.. వివాదంపై నోరు విప్పిన ప్రియమణి
Dacoit Day 6 Expected Box Office Collections Worldwide Adivi Sesh Film Box Office Report

డెకాయిట్ మూవీ సుమారు రూ.65 కోట్ల వ్యయంతో తెరకెక్కించినట్టు ట్రేడ్ అంచనా. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇందులో ఆంధ్ర ప్రాంతం నుంచి రూ.10 కోట్లు, నైజాం నుంచి రూ.7 కోట్లు, సీడెడ్ నుంచి రూ.3 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మరో రూ.10 కోట్ల వరకు బిజినెస్ జరగడంతో, మొత్తం వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.30 కోట్లకు చేరుకుంది. ఇదిలాఉంటే.. డెకాయిట్ మూవీకి సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో రికవరీ జరిగినట్లు సమాచారం.మొత్తం రూ.48 కోట్లు థియేటర్లకు ముందే వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

You May Also Like
ఆ యాంకర్‌తో సుడిగాలి సుధీర్ డేటింగ్ ? సీక్రెట్ రిలేషన్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా!
ఆ యాంకర్‌తో సుడిగాలి సుధీర్ డేటింగ్ ? సీక్రెట్ రిలేషన్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా!

ఇందులో తెలుగు ఓటీటీ హక్కులు, తెలుగు శాటిలైట్ హక్కులు, తెలుగు ఆడియో రైట్స్‌తో పాటు, హిందీ స్ట్రెయిట్ వెర్షన్‌కు సంబంధించిన ఓటీటీ, శాటిలైట్, ఆడియో హక్కులు కూడా ఉన్నాయి. ఈ రైట్స్ అమ్మకాల ద్వారానే నిర్మాతలు పెట్టుబడిలో పెద్ద భాగాన్ని ముందుగానే రికవర్ జరిగినట్టు తెలుస్తోంది. ఇలా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇలా బడ్జెట్ లెక్కలు పరిశీలిస్తే, మొత్తం రూ.65 కోట్ల వ్యయంలో నుంచి రూ.48 కోట్లు ఇప్పటికే రికవరీ కావడంతో, ఇంకా థియేట్రికల్ రన్ ద్వారా రావాల్సింది కేవలం రూ.17 కోట్లే. ఈ సినిమా థియేటర్ల ద్వారా కేవలం రూ.17 కోట్ల రాబడితే ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లినట్లే. ఇలా స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ కేవలంలో మూడు రోజుల్లోనే ఆ టార్గెట్ ను దాటింది. ప్రస్తుతం లాభాల్లో పరుగులు పెడుతుంది.

పుట్టిన 3 నెలల్లోనే గిన్నిస్‌తో పాటు 5 రికార్డులు.. బిగ్‌బాస్ సోనియా కూతురు రేర్ ఫిట్..
పుట్టిన 3 నెలల్లోనే గిన్నిస్‌తో పాటు 5 రికార్డులు.. బిగ్‌బాస్ సోనియా కూతురు రేర్ ఫిట్..

ఇలా విడుదలకు ముందుగానే భారీ మొత్తాన్ని రికవరీ చేసిన డెకాయిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. మొదటి రోజు శుక్రవారం ఈ సినిమా సుమారు రూ.6.55 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత శనివారం పాజిటివ్ మౌత్ టాక్ కొంత మేర పెరగడంతో కలెక్షన్లు రూ.6.85 కోట్లకు చేరాయి. ఆదివారం కూడా మంచి ఆక్యుపెన్సీ కొనసాగడంతో రూ.6.40 కోట్ల నెట్ రాబట్టి, ఓపెనింగ్ వీకెండ్‌ను సాలిడ్‌గా ముగించింది. మొత్తంగా మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా స్టేబుల్ ట్రెండ్‌ను చూపించడంతో, ప్రారంభ దశలోనే మంచి రన్‌ను అందుకుంది. అయితే వర్కింగ్ డేస్‌లోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితి కొంత మారింది. సోమవారం నుంచి కలెక్షన్లు క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. నాలుగో రోజు సుమారు రూ.2.70 కోట్ల నెట్ మాత్రమే వసూలు కాగా, ఐదో రోజు కూడా దాదాపు రూ.3.00 కోట్ల నెట్ వద్దే నిలిచింది. ఇది సాధారణంగా ప్రతి సినిమాకూ ఎదురయ్యే వర్కింగ్ డే డ్రాప్ అయినప్పటికీ, ఈ చిత్రానికి వచ్చిన మిక్స్‌డ్ టాక్ ప్రభావం కూడా కలెక్షన్లపై కొంత మేర పడినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

వారణాసిలో సాధువులంతా నకిలీలే.. హీరో ఆర్య వ్యాఖ్యలపై భగ్గుమన్న హిందూ సంఘాలు
వారణాసిలో సాధువులంతా నకిలీలే.. హీరో ఆర్య వ్యాఖ్యలపై భగ్గుమన్న హిందూ సంఘాలు

ప్రాంతాల వారీగా పరిశీలిస్తే, తెలుగు వెర్షన్‌కు మంచి ఆదరణ లభించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.20.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అయితే హిందీ మార్కెట్‌లో పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నప్పటికీ, అక్కడ మాత్రం స్పందన అంతగా కనిపించలేదు. హిందీ వెర్షన్ కేవలం రూ.5.40 కోట్ల నెట్ మాత్రమే రాబట్టడం కొంత నిరాశ కలిగించే అంశంగా మారింది. మొత్తం కలెక్షన్ల పరంగా చూస్తే, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.41.69 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ.29.69 కోట్లు కాగా, ఇండియా నెట్ రూ.25.50 కోట్లుగా నమోదైంది. ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. అక్కడ సుమారు రూ.12 కోట్ల గ్రాస్ వసూలు కావడం విశేషం. ఇది సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది.

Ram Charan: రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం.. గ్లోబల్ స్థాయిలో మెగా పవర్ స్టార్‌ క్రేజ్.
Ram Charan: రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం.. గ్లోబల్ స్థాయిలో మెగా పవర్ స్టార్‌ క్రేజ్.

ఇక ఆరో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే, వర్కింగ్ డే ప్రభావం కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డే 6 నాటికి ఇండియా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.3 నుంచి రూ.3.5 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా సుమారు 50 నుంచి 60 లక్షల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ లెక్కన చూస్తే, ఇండియా గ్రాస్ సుమారు రూ.33 కోట్లకు చేరుకోగా, ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల మార్క్‌కు దగ్గరపడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషణ చెబుతోంది. మొత్తంగా చూస్తే, ఈ డ్రాప్‌ను ట్రేడ్ వర్గాలు సాధారణంగానే తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఏ సినిమా అయినా అసలు పరీక్ష వర్కింగ్ డేస్‌లోనే ఉంటుంది. ఇప్పటికే లాభాల్లో ప్రయాణిస్తున్న ఈ మూవీ.. ఇక వచ్చే వీకెండ్‌లో కలెక్షన్ల పుంజుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X