Dacoit Day 7 Collections: తగ్గిన డెకాయిట్ కలెక్షన్లు.. అడివిశేష్ మూవీ బాక్సాఫీస్ పరిస్థితేంటీ?

Dacoit Box Office Collection: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన డెకాయిట్ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదలైంది. లవ్, యాక్షన్, ఫ్యామిలీ, రొమాన్స్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసింది. విడుదల తర్వాత మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, ఓపెనింగ్ వీకెండ్‌లో మాత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి కలెక్షన్లు నమోదు చేసింది. ప్రస్తుతం సినిమా లాభాల బాటలో సాగుతుండగా.. ర్కింగ్ డేస్‌లో కలెక్షన్లు కొంత తగ్గడం గమనించదగ్గ విషయం. ఈ నేపథ్యంలో డెకాయిట్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? 7వ రోజు అంచనా కలెక్షన్లు ఎంతంటే?

Also Read
'జబర్దస్త్ లో అలాంటి రూమర్స్ క్రియేట్.. బయటకు రావడానికి కారణం అతనే '
'జబర్దస్త్ లో అలాంటి రూమర్స్ క్రియేట్.. బయటకు రావడానికి కారణం అతనే '

ఈ దర్శకుడు షానెయిల్ డియో తెరకెక్కించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు నిర్మించారు. కథ, స్క్రీన్‌ప్లేలో అడివి శేష్ స్వయంగా పాల్గొనడం విశేషం. డైలాగ్స్‌ను అబ్బూరి రవి అందించారు, సినిమాటోగ్రఫీని ధనుష్ భాస్కర్ చేసారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, ఎడిటింగ్ బాధ్యతలను కోదాటి పవన్ కళ్యాణ్ నటించారు. అలాగే ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించడం కథకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా వారి నటనకు వెయిట్ అందించిందని చెప్పాలి.

Recommended For You
'అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది'.. సుడిగాలి సుధీర్‌కి స్టార్ యాంకర్ ప్రపోజల్‌!
'అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది'.. సుడిగాలి సుధీర్‌కి స్టార్ యాంకర్ ప్రపోజల్‌!
Dacoit Day 7 Expected Box Office Collections Worldwide Adivi Sesh Film Box Office Report

బడ్జెట్ పరంగా చూస్తే, డెకాయిట్ మూవీ సుమారు రూ.65 కోట్ల వ్యయంతో తెరకెక్కినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అయితే థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.30 కోట్ల వరకే జరిగగా, నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.48 కోట్ల వరకు రికవరీ అయినట్లు సమాచారం. అంటే థియేటర్ల ద్వారా కేవలం రూ.17 కోట్లు రాబడితే చాలు సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈ టార్గెట్‌ను సినిమా మొదటి మూడు రోజుల్లోనే క్రాస్ చేసి నిర్మాతలను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లింది. ప్రస్తుతం లాభాల్లో పరుగులు పెడుతుంది.

You May Also Like
'మా నాన్నకు బ్రేకప్.. నాకు బ్రేకప్.. ఇద్దరం కలిసి అలా బాధను పంచుకొంటాం'
'మా నాన్నకు బ్రేకప్.. నాకు బ్రేకప్.. ఇద్దరం కలిసి అలా బాధను పంచుకొంటాం'

కలెక్షన్ల పరంగా చూస్తే.. డెకాయిట్ సినిమా విడుదలకు ముందే మంచి రికవరీ సాధించడంతో థియేటర్లలో డీసెంట్ స్టార్ట్ అందుకుంది. మొదటి రోజు శుక్రవారం సుమారు రూ.6.55 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు శనివారం పాజిటివ్ మౌత్ టాక్‌తో రూ.6.85 కోట్లకు పెరిగింది. ఆదివారం కూడా మంచి ఆక్యుపెన్సీ కొనసాగడంతో రూ.6.40 కోట్ల నెట్ వసూలు చేసి, ఓపెనింగ్ వీకెండ్‌ను సాలిడ్‌గా ముగించింది. మొత్తం మూడు రోజుల్లోనే స్టేబుల్ ట్రెండ్‌ను చూపిస్తూ బ్రేక్ ఈవెన్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అందుకు ఎవరితోనైనా పడుకొంటాను.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
అందుకు ఎవరితోనైనా పడుకొంటాను.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

అయితే వర్కింగ్ డేస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత సహజంగానే కలెక్షన్లలో తగ్గుదల కనిపించింది. సోమవారం నుంచి జోరు తగ్గుతూ, నాలుగో రోజు రూ.2.70 కోట్లు, ఐదో రోజు రూ.3.00 కోట్లు, ఆరో రోజు సుమారు రూ.1.55 కోట్ల నెట్ వద్దే నిలిచింది. ఇది సాధారణ వర్కింగ్ డే డ్రాప్ అయినప్పటికీ, సినిమాకు వచ్చిన మిక్స్‌డ్ టాక్ ప్రభావం కూడా ఈ తగ్గుదలపై కొంతవరకు ప్రభావం చూపిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే, తెలుగు వెర్షన్ ఈ సినిమాకు ప్రధాన బలం అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటికే రూ.21.15 కోట్ల నెట్ వసూళ్లు రావడం విశేషం. కానీ హిందీ మార్కెట్‌లో అంచనాలు ఉన్నప్పటికీ, అక్కడ మాత్రం స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కేవలం రూ.5.90 కోట్ల నెట్ వద్దే నిలిచింది.

నాలో అలాంటి లోపాలు.. అయినా నేను ఎవ్వరికీ భయపడను.. బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా
నాలో అలాంటి లోపాలు.. అయినా నేను ఎవ్వరికీ భయపడను.. బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా

మొత్తం కలెక్షన్ల పరంగా చూస్తే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.43.89 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ.31.49 కోట్లు కాగా, ఇండియా నెట్ రూ.27.05 కోట్లుగా నమోదైంది. ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించి సుమారు రూ.12.40 కోట్ల గ్రాస్ రావడం గమనార్హం. ఇది అంతర్జాతీయ స్థాయిలో సినిమాపై ఉన్న ఆసక్తిని స్పష్టంగా తెలియజేస్తోంది.

Peddi: రామ్ చరణ్ 'పెద్ది’ మళ్లీ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
Peddi: రామ్ చరణ్ 'పెద్ది’ మళ్లీ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?

ఇక ఏడో రోజు (Day 7) అంచనాల ప్రకారం.. వర్కింగ్ డే ప్రభావం కొనసాగుతూ ఇండియాలో రూ.1.5 నుంచి రూ.2 కోట్ల మధ్య నెట్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లో కూడా సుమారు రూ.50 లక్షల వరకు వసూళ్లు ఉండొచ్చని అంచనా. ఈ లెక్కన చూస్తే, ఇండియా గ్రాస్ సుమారు రూ.35 కోట్లకు చేరుకోబోతుందనీ, వరల్డ్ వైడ్‌గా రూ.45 కోట్ల మార్క్‌ను టచ్ చేసే ఛాన్స్ ఉందని విశ్లేషణ. మొత్తానికి అడివి శేషు మూవీ ఇప్పటికే లాభాల్లోకి ఎంటర్ అయి సేఫ్ జోన్‌లో పరుగులు పెడుతోంది. వర్కింగ్ డేస్‌లో స్వల్ప డ్రాప్ ఉన్నప్పటికీ, రాబోయే వీకెండ్‌లో మళ్లీ పుంజుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి సెకండ్ వీకెండ్ కలెక్షన్లపైనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X