Dacoit Day 8 Collections: ‘డెకాయిట్’ కి షాకింగ్ క‌లెక్ష‌న్స్. అడివిశేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Dacoit Box Office Collection: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'డెకాయిట్'(Dacoit) . ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలు అందుకున్న విడుదలైన తర్వాత మిక్స్‌డ్ టాక్ అందుకుంది. అయితే.. విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారా మంచి రికవరీ సాధించడంతో ఈ చిత్రం థియేటర్లలో స్టేబుల్ ఓపెనింగ్‌ను అందుకుంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఓపెనింగ్ వీకెండ్‌లో మాత్రం గట్టి కలెక్షన్లు నమోదు చేసి ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో డెకాయిట్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? 8వ రోజు అంచనా కలెక్షన్లు ఎంతంటే?

డెకాయిట్ సినిమాను దర్శకుడు షానెయిల్ డియో తెరకెక్కించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు నిర్మించారు. సుమారు రూ.65 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా థియేకల్ బిజినెస్ దాదాపు రూ.30 కోట్ల వరకు జరిగింది. అయితే అసలు గేమ్ నాన్-థియేట్రికల్ రైట్స్ దగ్గరే మారింది. డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా ఈ సినిమా సుమారు రూ.48 కోట్ల వరకు రికవరీట్లు సమాచారం. దీనితో థియేటర్ల ద్వారా కేవలం రూ.17 కోట్లు రాబడితే చాలు సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో సినిమా రిలీజ్ అయిన తొలి మూడు రోజుల్లోనే ఈ టార్గెట్‌ను క్రాస్ చేయడం విశేషం. ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లతోనే నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు.

Dacoit Day 8 Expected Box Office Collections Worldwide Adivi Sesh Film Box Office Report

కలెక్షన్ల పరంగా చూస్తే.. డెకాయిట్ సినిమా విడుదలకు ముందే మంచి రికవరీ సాధించడంతో థియేటర్లలో డీసెంట్ స్టార్ట్ అందుకుంది విడుదలైన శుక్రవారం రోజున సుమారు రూ.6.55 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు శనివారం పాజిటివ్ మౌత్ టాక్‌తో రూ.6.85 కోట్లకు పెరిగింది. ఆదివారం కూడా ఆక్యుపెన్సీ బాగుండటంతో రూ.6.40 కోట్ల నెట్ వసూలు చేసింది. ఈ లెక్కన చూస్తే, తొలి మూడు రోజుల్లోనే సినిమా స్ట్రాంగ్ ట్రెండ్ చూపించి, స్టేబుల్ కలెక్షన్లతో ముందుకు సాగింది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లతోనే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. వీకెండ్ ముగిసిన తర్వాత, వర్కింగ్ డేస్ ప్రభావం కలెక్షన్లపై స్పష్టంగా కనిపించింది. సోమవారం నుంచి వసూళ్లు తగ్గుతూ నాలుగో రోజు రూ.2.70 కోట్లు, ఐదో రోజు రూ.3.00 కోట్లు, ఆరో రోజు రూ.1.55 కోట్లు, ఏడో రోజు సుమారు రూ.1.40 కోట్ల నెట్ వద్ద నిలిచింది. ఇది సాధారణంగా ప్రతి సినిమాకీ కనిపించే ట్రెండ్ అయినప్పటికీ, ఈ సినిమా వచ్చిన మిక్స్‌డ్ టాక్ కూడా ఈ డ్రాప్‌పై కొంత ప్రభావం చూపిందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయినప్పటికీ సినిమా పూర్తిగా పడిపోకుండా డీసెంట్ హోల్డ్ చూపించడం పాజిటివ్ సిగ్నల్‌గా భావించవచ్చు. మొత్తం కలెక్షన్లను పరిశీలిస్తే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.45.71 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ.33.11 కోట్లు కాగా, ఇండియా నెట్ రూ.28.45 కోట్లుగా నమోదైంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. విదేశాల్లోనే సుమారు రూ.12.60 కోట్ల గ్రాస్ రావడం విశేషం.

ఇది సినిమా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి రీచ్ సాధించిందని చెప్పవచ్చు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే, తెలుగు వెర్షన్ ఈ సినిమాకు ప్రధాన బలం అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.22.22 కోట్ల నెట్ వసూళ్లు రావడం గమనార్హం. అయితే హిందీ మార్కెట్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, అక్కడ మాత్రం స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కేవలం రూ.6.23 కోట్ల నెట్ వద్దే ఆగిపోయింది. ఇది కలెక్షన్లపై కొంత ప్రభావం చూపిన అంశంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఎనిమిదో రోజు (Day 8) కలెక్షన్లపై కూడా అంచనాలు వెలువడుతున్నాయి. వర్కింగ్ డే ప్రభావం,అలాగే, ఈ రోజే ఒక్కసారిగా కొత్తగా 4 సినిమాలు విడుదల కావడం వల్ల ఇండియాలో రూ.1.5 నుంచి రూ.2 కోట్ల మధ్య నెట్ కలెక్షన్లు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లో కూడా సుమారు రూ.40 లక్షల వరకు వసూళ్లు వచ్చే అవకాశముంది. ఈ లెక్కన చూస్తే.. ఇండియా గ్రాస్ త్వరలోనే రూ.35 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది. అలాగే వరల్డ్‌వైడ్ కలెక్షన్లు రూ.48 కోట్ల దిశగా దూసుకెళ్తున్నాయి.

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సినిమా ఇప్పటికే ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయింది. నాన్-థియేట్రికల్ రికవరీ బలంగా ఉండటంతో, థియేట్రికల్ కలెక్షన్లు అదనపు లాభాలుగా మారుతున్నాయి. ఇది అడివి శేష్ కెరీర్‌లో మరో సక్సెస్‌ఫుల్ బాక్సాఫీస్ మోడల్‌గా నిలుస్తోంది. మిక్స్‌డ్ టాక్ ఉన్నా కూడా బిజినెస్ పరంగా సినిమా విజయవంతమైందని చెప్పవచ్చు.ప్రస్తుతం అందరి దృష్టి సెకండ్ వీకెండ్ కలెక్షన్లపైనే ఉంది. వీకెండ్‌లో మళ్లీ జోరు పెరిగితే సినిమా మరింత స్ట్రాంగ్ కలెక్షన్లు అందుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X