Dacoit Day 9 Collections: డెకాయిట్' బాక్సాఫీస్ బ్లాస్ట్.. అడివి శేషు మూవీకి ఎన్ని కోట్లంటే?
Dacoit Box Office Collection: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా డెకాయిట్ (Dacoit). ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. అయితే ముందుగానే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా గణనీయమైన ఆదాయం రాబట్టడం వల్ల, థియేట్రికల్ రిస్క్ కొంతవరకు తగ్గింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద స్థిరంగా రన్ అవుతూ ఆసక్తికరమైన ట్రెండ్‌ను చూపిస్తోంది.
ముఖ్యంగా ఓపెనింగ్ వీకెండ్‌లో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది. ప్రేక్షకుల నుంచి మౌత్ టాక్ పెరుగుతూ ఉండటంతో కలెక్షన్లు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెకాయిట్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? 9వ రోజు అంచనా కలెక్షన్లు ఎంతంటే?

దర్శకుడు షానెయిల్ డియో తెరకెక్కించిన డెకాయిట్ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌ల నిర్మాణంలో రూపొందించారు. సుమారు రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.30 కోట్ల వరకు జరిగినప్పటికీ, అసలు గేమ్ మాత్రం నాన్-థియేట్రికల్ రైట్స్ దగ్గరే మారింది. డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా సుమారు రూ.48 కోట్ల వరకు రికవరీ సాధించడం ఈ సినిమాకు బలంగా మారింది. దీంతో థియేటర్ల ద్వారా కేవలం రూ.17 కోట్లు రాబడితే చాలు సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే పరిస్థితి ఏర్పడింది. ఇదే ప్లస్‌గా మారి, విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ టార్గెట్‌ను దాటడం ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచింది. ఓపెనింగ్ వీకెండ్ ముగిసే సరికి నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోవడం ఈ సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచింది.
ఇక రోజు వారి కలెక్షన్ల పరంగా పరిశీలిస్తే.. రిలీజ్ రోజునే ఈ సినిమా రూ.6.55 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసి డీసెంట్ స్టార్ట్ అందుకుంది. రెండో రోజు శనివారం పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా కలెక్షన్లు పెరిగి రూ.6.85 కోట్లకు చేరాయి. ఆదివారం కూడా ఆక్యుపెన్సీ బాగుండటంతో రూ.6.40 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ లెక్కన తొలి మూడు రోజుల్లోనే సినిమా గట్టి ట్రెండ్ చూపించి, స్ట్రాంగ్ ఓపెనింగ్ వీకెండ్‌ను నమోదు చేసింది. అయితే వీకెండ్ తర్వాత సాధారణంగా కనిపించే డ్రాప్ ఈ సినిమాకూ కనిపించింది. సోమవారం నుంచి కలెక్షన్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. నాలుగో రోజు రూ.2.70 కోట్లు, ఐదో రోజు రూ.3.00 కోట్లు, ఆరో రోజు రూ.1.55 కోట్లు, ఏడో రోజు రూ.1.40 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.02 కోట్ల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి.
ఇక మొత్తం కలెక్షన్లను పరిశీలిస్తే.. డెకాయిట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.46.89 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ.34.29 కోట్లు కాగా, ఇండియా నెట్ రూ.29.47 కోట్లుగా నమోదైంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాకు గణనీయమైన స్పందన లభించడం విశేషం. విదేశాల్లోనే సుమారు రూ.13 కోట్ల గ్రాస్ రావడం, సినిమాకు గ్లోబల్ రీచ్ పెరిగినట్టు సూచిస్తోంది. ప్రాంతాల వారీగా చూస్తే, తెలుగు వెర్షన్ ఈ సినిమాకు ప్రధాన బలం అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.23.22 కోట్ల నెట్ వసూళ్లు రావడం గమనార్హం. అయితే హిందీ మార్కెట్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, అక్కడ మాత్రం స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కేవలం రూ.6.25 కోట్ల నెట్ వద్దే ఆగిపోయింది.
ఇక తొమ్మిదో రోజు అంచనాల ప్రకారం, వీకెండ్ అడ్వాంటేజ్‌తో కలెక్షన్లు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇతర సినిమాలు మిక్స్‌డ్ టాక్ అందుకోవడం కూడా ఈ సినిమాకు ప్లస్‌గా మారే అవకాశం ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1.5 నుంచి రూ.2 కోట్ల మధ్య నెట్ వసూళ్లు వచ్చే అవకాశముండగా, ఓవర్సీస్‌లో సుమారు రూ.50 లక్షల వరకు రావచ్చని అంచనా. ఈ ట్రెండ్ కొనసాగితే ఇండియా గ్రాస్ త్వరలోనే రూ.36 కోట్లు దాటే అవకాశం ఉంది. అదే సమయంలో వరల్డ్‌వైడ్ కలెక్షన్లు రూ.50 కోట్ల మార్క్‌ను టచ్ చేసే దిశగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే మూవీ మేకర్స్ మాత్రం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని ప్రకటిస్తూ, ప్రేక్షకుల ప్రేమ, ఎమోషనల్ కనెక్ట్ వల్లే ఈ విజయమని పేర్కొంది. ఇంకా చూడని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లలో చూడాలని ప్రత్యేక పోస్టర్ ద్వారా కోరింది.
మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ సినిమాను ఎక్కువగా నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేయడం. కొన్ని ప్రాంతాలు మినహా చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ తమ చేతుల్లోనే ఉంచుకోవడంతో, థియేట్రికల్ కలెక్షన్లపై నేరుగా లాభాలు అందేలా వ్యూహం రచించారు. ఈ ప్లాన్ సక్సెస్ అవడంతో 'డెకాయిట్' ఇప్పటికే లాభదాయక ప్రాజెక్ట్‌గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా, మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ బలమైన నాన్-థియేట్రికల్ బిజినెస్, స్ట్రాటజిక్ రిలీజ్ ప్లానింగ్, ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల వల్ల ఈ సినిమా ఇప్పటికే ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు అందరి దృష్టి సెకండ్ వీకెండ్‌పై ఉంది. ఆ రోజుల్లో కలెక్షన్లు మళ్లీ పెరిగితే, ఈ సినిమా మరింత స్ట్రాంగ్ రన్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications





