Dacoit Business: డెకాయిట్ వరల్డ్ వైడ్ బిజినెస్.. అడివి శేష్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

టాలెంటెడ్ హీరో అడివి శేష్, యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం డెకాయిట్. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, రొమాంటిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10వ తేదీన విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెకాయిట్ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ గురించి ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో డెకాయిట్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? అడివి శేష్ మూవీకి బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..

డెకాయిట్ తారాగణం
డెకాయిట్ మూవీకి షానీ డియో దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెకాయిట్‌లో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మారీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అడివి శేష్, షానీల్ డియోలు ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Dacoit Movie Pre Release Business Worldwide Adivi Sesh Movie Budget Theatrical Business Break Even Target details

డెకాయిట్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి డెకాయిట్ మూవీకి 70 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. ప్రమోషనల్ కార్యక్రమాలు, ఈవెంట్ల కోసం భారీగా ఖర్చు చేసి సినిమాపై హైప్ తగ్గకుండా చూసుకుంటూ వచ్చారు.

డెకాయిట్ డిస్ట్రిబ్యూషన్ వీరికే
మేజర్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అడివి శేష్ నటిస్తోన్న మూవీ కావడంతో పాటు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీనికి తగినట్లుగానే ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీ మార్కెట్‌ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్‌కు చెందిన పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ దక్కించుకుంది. ముంబై, మధ్య భారతం, రాజస్థాన్ సహా ప్రధానమైన ఉత్తరాది ఏరియాలలో డెకాయిట్‌ను ఈ సంస్థ విడుదల చేయనుంది. కీలకమైన నైజాం ఏరియాలో అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ హక్కులను మోక్ష మూవీస్ సొంతం చేసుకుంది.

డెకాయిట్ థియేట్రికల్ బిజినెస్ ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో డెకాయిట్ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 3 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో డెకాయిట్‌కు 20 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 3.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 6.5 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా డెకాయిట్ మూవీకి 30 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో అడివి శేష్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 32 కోట్ల రూపాయల షేర్.. 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ఈవెన్ టార్గెట్ నిర్దేశించారు. మరి అడివి శేష్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

Read more about: dacoit adivi sesh mrunal thakur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X