twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూఎస్ రిపోర్ట్ : ఆ విషయంలో ‘ఢమరుకం’ ఫెయిల్

    By Bojja Kumar
    |

    Damarukam
    హైదరాబాద్ : అక్కినేని నాగార్జున, అనుష్క జంటగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ 'ఢమరుకం' అమెరికా బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే గత వారం రిలీజై కలెక్షన్ల పరంగా దూసుకెలుతున్న తమిళ చిత్రం 'తుపాకి' జోరుకు 'ఢమరుకం' చిత్రం బ్రేక్స్ వేస్తుందనే ట్రేడ్ నిపుణులు అంచనాలు మాత్రం తారుమారయ్యాయి. తుపాకి జోరును తగ్గించడంలో 'ఢమరుకం' ఫెయిల్ అయంది.

    ఢమరుకం చిత్రం ఈ నెల 22న అమెరికాలో మొత్తం 20 స్క్రీన్లలో రిలీజైంది. ఇక్కడ ఈ చిత్రానికి సూపర్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే రెండో స్థానానికి మాత్రమే పరిమితం అయింది. నాలుగు రోజుల వీకెండ్‌లో ఈచిత్రం రూ. 6.47 లక్షలు ($1,08,882) కలెక్ట్ చేసింది. గురువారం $ 19,127, శుక్రవారం $ 30,936, శనివారం $ 37,270, ఆదివారం $ 21,549 వసూలు చేసింది.

    విజయ్-కాజల్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం 'తుపాకి' అమెరికా బాక్సాఫీసు వద్ద వండర్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తోంది. తొలి వారం ఈచిత్రం అక్కడ రూ. 1.76 కోట్లు రాబట్టింది. ఢమరుకం విడుదల కావడంతో రెండో వారం కలెక్షన్లు తగ్గుతాయని ట్రేడ్ నిపుణులు భావించారు. అయితే డమరుకం ప్రభావం ఆ సినిమాపై పెద్దగా కనిపించలేదు. రెండో వారంలో తుపాకి చిత్రం అక్కడ రూ. 75 లక్షలు వసూలు చేసింది మొత్తం 13 రోజుల్లో రూ. 2.51 కోట్లు($ 4,52,734) కలెక్ట్ చేసింది.

    మరో తెలుగు సినిమా 'రొటీన్ లవ్ స్టోరీ' ప్రస్తుతం అమెరికా బాక్సాఫీసు వద్ద మూడో స్థానంలో నిలిచింది. అక్కడ 13 స్క్రీన్లలో విడుదలైన రొటీన్ లవ్ స్టోరీ తొలి నాలుగు రోజుల్లో రూ. 4.61 లక్షలు($ 8,300) వసూలు చేసింది. గురువారం $ 1,704, శుక్రవారం $ 2,033, శనివారం $ 2,331, ఆదివారం $ 2232 వసూలు చేసింది.

    English summary
    Telugu movie Damarukam starring Nagarjuna and Anushka Shetty in leads, has opened to a very good response in America. The socio-fantasy movie was expected to send down the collection of Tamil film Thuppakki, which had done a rocking business at the USA Box Office in the first week. But it has failed to push it down in the 
 
 collection chart in this foreign country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X