Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
యూఎస్ రిపోర్ట్ : ఆ విషయంలో ‘ఢమరుకం’ ఫెయిల్
ఢమరుకం చిత్రం ఈ నెల 22న అమెరికాలో మొత్తం 20 స్క్రీన్లలో రిలీజైంది. ఇక్కడ ఈ చిత్రానికి సూపర్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే రెండో స్థానానికి మాత్రమే పరిమితం అయింది. నాలుగు రోజుల వీకెండ్లో ఈచిత్రం రూ. 6.47 లక్షలు ($1,08,882) కలెక్ట్ చేసింది. గురువారం $ 19,127, శుక్రవారం $ 30,936, శనివారం $ 37,270, ఆదివారం $ 21,549 వసూలు చేసింది.
విజయ్-కాజల్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం 'తుపాకి' అమెరికా బాక్సాఫీసు వద్ద వండర్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తోంది. తొలి వారం ఈచిత్రం అక్కడ రూ. 1.76 కోట్లు రాబట్టింది. ఢమరుకం విడుదల కావడంతో రెండో వారం కలెక్షన్లు తగ్గుతాయని ట్రేడ్ నిపుణులు భావించారు. అయితే డమరుకం ప్రభావం ఆ సినిమాపై పెద్దగా కనిపించలేదు. రెండో వారంలో తుపాకి చిత్రం అక్కడ రూ. 75 లక్షలు వసూలు చేసింది మొత్తం 13 రోజుల్లో రూ. 2.51 కోట్లు($ 4,52,734) కలెక్ట్ చేసింది.
మరో తెలుగు సినిమా 'రొటీన్ లవ్ స్టోరీ' ప్రస్తుతం అమెరికా బాక్సాఫీసు వద్ద మూడో స్థానంలో నిలిచింది. అక్కడ 13 స్క్రీన్లలో విడుదలైన రొటీన్ లవ్ స్టోరీ తొలి నాలుగు రోజుల్లో రూ. 4.61 లక్షలు($ 8,300) వసూలు చేసింది. గురువారం $ 1,704, శుక్రవారం $ 2,033, శనివారం $ 2,331, ఆదివారం $ 2232 వసూలు చేసింది.