ఎన్టీఆర్ ‘దమ్ము’ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్
ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం 'దమ్ము'త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కె.ఎస్ రామారావు తమ క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం పాటలు ఇప్పటికే రిలిజై సినిమాపై విపరీతమైన క్రేజ్ తెచ్చాయి. త్రిష,కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగినట్లు సమాచారం. ఈ సినిమాని బోయపాటి శ్రీను చాలా ఫవర్ ఫుల్ గా తెరకెక్కించినట్లు చెప్తున్నారు. ఈ చిత్రం డిస్ట్ర్రిబ్యూటర్స్ లిస్ట్ ఇదే...
నైజాం: దిల్ రాజు
కడప : కోడూరు మధు
బళ్లారి : బళ్లారి సాయి
మిగిలిని సీడెడ్ : బళ్లారి సాయి (త్రూ)ఎన్ వి ప్రసాద్
ఈస్ట్ గోదావరి: అనుశ్రీ ఫిల్మ్స్
వైజాగ్: భారత్ పిక్చర్స్
వెస్ట్ గోదావరి : ఎల్ వి ఆర్
నెల్లూరు: బేకరీ ప్రసాద్ (త్రూ)తేజ ఫిల్మ్స్
ముంబై,కర్ణాటక : రాఘవేంద్ర ఎంటర్టైప్రేజస్
మిగిలిన కర్ణాటక: కుబేరన్ పిక్చర్స్
తమిళనాడు : ఎస్ పి ఐ సినిమాస్
మిగిలిన ఇండియా : ఓమ్ వెంకట్ సాయి ఎగ్జిబిటర్స్
ఓవర్ సీస్: ఫికాస్
ఇక తమిళనాడులోనూ ఈ సినిమాను 25 ప్రింట్లతో విడుదల చేస్తున్నారు చెన్నై సత్యం ధియోటర్స్ వారు ఈ రైట్స్ ని ఎస్ పి ఐ ప్రెవేట్ లిమిటెడ్ పై కొన్నారు. ఈ మధ్య కాలంలో తమిళంలో ఎక్కువ ప్రింట్లతో రిలిజవుతున్న తెలుగు సినిమా ఇదే అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ కే దమ్ము ఉంది. అంతటి మగాడు అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి కోసం తన దమ్ము చూపించాడు. అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బోయపాటి శ్రీను.త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత. ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్ యాక్షన్ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. ఇక ఈ చిత్రం కాక ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల చిత్రం చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్ చిత్రం సైతం ఆయన కమిటైనట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











