‘దమ్ము’ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ (అఫీషియల్)
జూ ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. 1400 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైన ఈచిత్రం తొలి రోజు రూ. 13 కోట్ల షేర్ వసూలు చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 9 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాతలు కె.ఎస్.రామారావు, ఆయన తనయడు కె.ఎ.వల్లభ స్వయంగా ఈ రోజే ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో వెల్లడించారు.
బోయపాటి శ్రీను-ఎన్టీఆర్ కాంబినేషన్లో మా సంస్థకు ఈ సక్సెస్ రావడం ఎంతో ఆనందంగా ఉంది, ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అయిన మా అబ్బాయి వల్లభ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడనే నమ్మకం ఉందని కె.ఎస్.రామారావు చెప్పారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ...తాము ఊహించినట్లుగానే ఈచిత్రం ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని, ప్రతి ఇంట్లో ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుండు అనేలా ఎన్టీఆర్ నటించారు. త్రిష, కార్తీక వందశాతం తమ పాత్రలకు న్యాయం చేశారని బోయపాటి చెప్పారు. తనతో పాటు పని చేసిన టెక్నీషియన్స్ అంతా కష్టపడి పని చేశారని, అందుకే ఈ విజయం దక్కిందన్నారు.
నిర్మాత వల్లభ మాట్లాడుతూ...నిర్మాతగా తన తొలి చిత్రం భారీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మరిన్ని సినిమాలు రూపొందిస్తానని చెప్పారు. ఈ సక్సెస్ మీట్లో దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాతలు కె.ఎస్. రామారావు, కె.ఎ.వల్లభ, సినిమాటోగ్రాఫర్ ఆర్థర్ విల్సన్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











