‘దమ్ము’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (అఫీషియల్)
'దమ్ము' ఫస్ట్ వీక్ కలెక్షన్లు అదిరిపోయాయి. తొలి వారం ఈచిత్రం ఓవరాల్‌గా అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తం రూ. 31 కోట్ల షేర్ సాధించింది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే రూ. 24 కోట్ల షేర్ సాధించింది. ఈ విషయాన్ని దమ్ము చిత్రం నిర్మాత కె.ఎస్. రామారావు స్వయంగా ప్రకటించారు. మా సినిమా సత్తా ఏమిటో ఈ వాసూళ్లను చూస్తే తెలుస్తుంది అన్నారు.
ఇక పోతే ఈచిత్రం తొలి రోజు దాదాపు 1400 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రూ. 13 కోట్ల షేర్ వసూలు చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 9 కోట్లు రాబట్టింది. దమ్ము చిత్రం తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుప్పటికీ ఈ రేంజ్‌లో వీకెండ్ కలెక్షన్లు కురిపించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
దమ్ము నిర్మాతలు తమ చిత్రాన్ని పైరసీ కాకుండా గట్టి చర్యలు తీసుకోవడం కూడా....సినిమాకు ప్లస్సయిందని చెప్పొచ్చు. మద్రాసు హైకోర్టు నుంచి ముదస్తు లీగల్ నోటీసులు జారీ చేసి చిత్రాన్ని ఎవరు పైరసీ చేయకుండా, ఇంటర్నెట్ నుంచి పైరసీ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటించారు. రెండు వంశాల మధ్య గొడవ నేపథ్యంలో దమ్ము చిత్రం సాగుతుంది. జూ ఎన్టీఆర్ విజయ ధ్వజ సింహగా సీరియస్ క్యారెక్టర్లో, రామచంద్రగా ఫన్నీ క్యారెక్టర్లో అలరించారు. అపజయం అంటూ ఎరుగని బోయపాటి శ్రీను మరోసారి తన దర్శకత్వ దమ్ము ఏమిటో ఈ చిత్రం ద్వారా చూపించారు.


Click it and Unblock the Notifications











