ఎన్టీఆర్ 'దమ్ము' ఫైనల్ రిజల్ట్ ఏంటి?
ఎన్టీఆర్ దమ్ము చిత్రం విడుదలైన మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. కొందరు ప్లాప్ అన్నా..మరికొందరు హిట్ అన్నా చివరకు యావరేజ్ అని ఫైనల్ గా పిక్స్ చేసారు. అయితే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ బాగానే కొల్లగొడుతోందని ట్రేడ్ లో చెప్తున్నారు. సిటీలలో తప్పిస్తే బి,సి సెంటర్లలో ఈ చిత్రం నిలబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు ఇప్పుడు ఈ వారంలో ఏ సినిమా విడుదల అయ్యి పోటీ ఇవ్వకపోవటం కూడా కలిసి వచ్చే అంశమే. కేవలం బాలాజీ శక్తివేల్ రూపొందించిన తమిళ చిత్రం డబ్బింగ్ ప్రేమలో పడితే మాత్రమే వస్తోంది. సురేష్ కొండేటి రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ సినిమాకు ఎలాగూ పోటీ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి సమస్య లేదంటున్నారు.
ఇక గబ్బర్ సింగ్ వచ్చేదాగా ఈ సినిమా కలెక్షన్స్ కి ఢోకా లేదంటున్నారు. వీకెండ్ లలో బాగానే ఉన్నా..సోమవారం నుంచి సిటీలో చాలా చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అయితే అన్ని ధియోటర్లు ఒకేసారి విడుదల చేయటంతో శుక్ర,శని,ఆదివారాలలో రెగ్యులర్ గా సినిమా టాక్ తో సంభందం లేకుండా సినిమా చేసావారు చూసేసారు..సోమవారం నుంచి టాక్ ని బట్టి వెళ్తూంటారు. డివైడ్ టాక్ రావటంతో ఈ సినిమాకి మైనస్ అయ్యింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ బాగా నిరాశపరచటంతో అభిమానులు సైతం సాటిస్ పేక్షన్ తో ఈ చిత్రం గురించి చెప్పలేని స్దితి ఏర్పడింది. అయితే బోయపాటి శ్రీను కొన్ని యాక్షన్,ఎమోషన్ సీన్స్ లో గ్రిప్ చూపించటం సినిమాకు ప్లస్ అయ్యింది.
ముఖ్యంగా సినిమాపై ఏర్పడిన విపరీతమైన ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోవటం కూడా సినిమా రిజెల్ట్ పై పడిందంటున్నారు. సింహా పోలికలు సినిమాలో కనపడటం,విలన్ మరీ ముసలివాడవటం,అంత దుర్మార్గుడైన విలన్ ని హీరో వదిలేయటం వంటి అంసాలు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అయితే ఫస్టాఫ్..ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగా జనాలకి కిక్ ఇస్తోంది. సెకండాఫ్ లో రొమాన్స్,కామెడీ తగ్గటం కూడా సినిమాకు ఓ రకంగా మైనస్ అయ్యింది. అప్పటికీ ఎన్టీఆర్ తన దైన శైలిలో భావోద్వేగాలను పండించి సినిమాను అప్పటికి వరకూ లాక్కోచ్చి యావరేజ్ చేసాడని చెప్తున్నారు.
ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటించారు. వారిద్దరూ ఎన్టీఆర్ కన్నా పెద్ద వాళ్లలా ఉన్నాయనే కామెంట్స్ వినిపించటం జరిగింది. ఇక తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించాడు కానీ ఆ పాత్ర సినిమాకు పెద్దగా వర్కవుట్ కాలేదు. భానుప్రియ.. ఎన్టీఆర్ కి తల్లిగా చేసింది..ఆమె పాత్ర ఉన్నంతంలో బాగా పండింది. అయితే ఆమె భర్తగా ..ఎన్టీఆర్ తండ్రిగా చేసిన సుమన్ పాత్ర మాత్రం క్లైమాక్స్ లో మైనస్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











