తమిళనాడులో ‘దమ్ము’ రికార్డు స్థాయిలో...
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రం రికార్డు స్థాయిలో తమిళనాట విడుదలవ్వబోతోంది. చెన్నయ్ సత్యం సినిమాన్ 'దమ్ము' చిత్రం యొక్క థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. తమిళనాడు వ్యాప్తంగా ఈచిత్రం 25 స్క్రీన్లలో ప్రదర్శితం కాబోతోంది. ఈ నెల 27న 'దమ్ము' చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
తెలుగు సినిమాలను నేరుగా తెలుగులో తమిళనాట 25 స్క్రీన్లలో రిలీజ్ చేయడం ఇటీవల కాలంలో పోలిస్తే రికార్డే స్థాయి అని చెప్పుచ్చు. తమిళంలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తే ఇది చిన్న సంఖ్యే. కానీ 'దమ్ము' చిత్రం తమిళంలో డబ్ చేయలేదు.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీయార్ కు జోడీగా త్రిష, కార్తీక నటించారు. సీనియర్ నిర్మాత కె.యస్. రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ ఈచిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్ లో యువ హీరోల సినిమాలు ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాల కారణం పాత రికార్డుల్ని కొత్త రికార్డులు అతి తక్కువ సమయంలోనే క్రాస్ చేస్తున్నాయి.
తాజాగా 'రచ్చ' సృష్టించిన రికార్డుల్ని 'దమ్ము' క్రాస్ చేయడం ఖాయమని నందమూరి అభిమానులు అంటున్నారు. ఈ ఇద్దరు యువ హీరోలు సినిమాల ప్రారంభోత్సవాల్లో ఎలాంటి పొరపొచ్చలు లేకుండా పాల్గొంటున్నా, అభిమానులు మాత్రం కొత్త రికార్డుల కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. సో రాబోతోన్న 'దమ్ము' సృష్టించే రికార్డుల మీదనే అందరి దృష్టి ఉంది. 'సింహా'తో సంచలన విజయం నమోదు చేసుకున్న బోయపాటి శ్రీను, నిర్మాత కెయస్ రామారావు సైతం అదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











