'రోబో' తర్వాత ఆ రికార్డు 'దమ్ము'కే
శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రం అప్పట్లో సౌతిండియా చిత్రాల్లో ఎక్కువ స్క్రీన్ లతో విడుదలైన చిత్రం. ఆ తర్వాత ఆ రికార్డుని ఎవరూ రీచ్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు 'దమ్ము' ఎక్కువ స్క్రీన్స్ లో తమ చిత్రాన్ని విడుదల చేస్తూ రికార్డు క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 1230 స్క్రీన్స్ లలో విడుదల అవుతూ సౌత్ ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ రిలీజ్ గా రికార్డు నమోదు చేసింది. మొదటి ప్లేసు మాత్రం రోబోకే ఉండిపోయింది. ఆ స్క్రీన్స్ లిస్ట్ ఏరియాల వారిగా ఓ సారి చూస్తే...
నైజాం: 260
వైజాగ్: 70
ఈస్ట్ గోదావరి: 75 (రికార్డు)
వెస్ట్ గోదావరి: 55
కృష్ణ: 75
గుంటూరు: 80 (రికార్డు)
నెల్లూరు: 40 (రికార్డు)
సీడెడ్: 165 (రికార్డు)
మొత్తం ఆంధ్రప్రదేశ్: 820 (రికార్డు)
కర్ణాటక: 150 (రికార్డు)
ఒరిస్సా: 23 (రికార్డు)
తమిళనాడు: 22 (రికార్డు)
భారత్ లో మిగిలిన ప్రాంతాలు: 45
మన దేశంలో మొత్తం స్క్రీన్స్: 1060 (రికార్డు)
ఇక ఇప్పటికే ఈ చిత్రం బుక్కింగ్స్ అన్ని చోట్లా అయిపోయాయి. మల్టిప్లెక్స్ లు, ఆన్ లైన్ లో రెండు రోజుల క్రితమే టిక్కెట్లు మొత్తం అమ్ముడైపోయాయి. ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఏ విధమైన రికార్జులు క్రియేట్ చేస్తుందా అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. దమ్ములో హైలెట్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి.. ఎన్టీఆర్ సింహాద్రిను తలపించే రేంజిలో పాత్ర అంటున్నారు. ఆ రేంజి ఎమోషన్స్ ఆ పాత్రలో నింపాడని చెప్తున్నారు. అలాగే చిత్రంలో రెండో హైలెట్ సిస్టర్ సెంటిమెంట్. శంభో శివ శంబోలో చేసిన అభినయ ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు చెల్లిగా చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే టచింగ్ సీన్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాంటున్నారు. రాఖీ రేంజిలో సిస్టర్ సెంటిమెంట్ పండుతుందని చెప్తున్నారు. వీటికి అదనపు బలం ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం. యమదొంగ, సింహాద్రి తరహాలో ఈ చిత్రంలో పాటలన్నీ మ్యూజికల్ హిట్స్ అవ్వటమే కాక సినిమా సీన్స్ కు బలం చేకూరుస్తాయని చెప్తున్నారు. చివరగా అపజయమెరగని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ.
వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణను సింహా చిత్రంతో మరోసారి హిట్ పధంలో నడిపించిన ఘనత బోయపాటికే దక్కింది. ఈ చిత్రంతో తను యంగ్ హీరోల చిత్రాలను డైరక్ట్ చేసే కంటిన్యూ అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాడు..అందుకు తగిన కృషి చిత్రంలో కనిపిస్తుందని చెప్తున్నారు.ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు. భానుప్రియ.. ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు. త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత. ఈ చిత్రం విజయంపై నిర్మాత చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు.


Click it and Unblock the Notifications











