twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనాలో దంగల్ జోరు.. రికార్డు కలెక్షన్లు.. రేటింగ్ 9.8/10

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం చైనాలో హవా కొనసాగిస్తున్నది. విడుదలైన తొలిరోజే అత్యధిక కలెక్షన్లను సాధించింది. దంగల్ సినిమాపై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.

    By Rajababu
    |

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం చైనాలో హవా కొనసాగిస్తున్నది. విడుదలైన తొలిరోజే అత్యధిక కలెక్షన్లను సాధించింది. దంగల్ సినిమాపై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. దంగల్ ప్రదర్శిస్తున్న థియేటర్లు ప్రేక్షకుల అరుపులు, చప్పట్లతో దద్దరిలుతున్నదనే తాజా సమాచారం. గతంలో చైనాలో పీకే సాధించిన కలెక్షన్ల రికార్డులను దంగల్ తిరుగరాయడం విశేషం.

    చైనాలో దంగల్ జోరు..

    చైనాలో దంగల్ జోరు..

    చైనాలో దంగల్ చిత్రం శుక్రవారం (మే 5) రోజున రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు రూ.20.65 కోట్ల (22.16 మిలియన్ యాన్స్) వసూళు చేసింది. భారతీయ చిత్రాలకు సంబంధించి చైనాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా పీకే పేరిట రికార్డు ఉంది. పీకే వసూలు చేసిన రూ. 5.7 కోట్ల రికార్డును దంగల్ తుడిపేసింది. గతంలో పీకే చిత్రం చైనాలో రూ.100 కోట్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే.

    7000 స్క్రీన్లలో..

    7000 స్క్రీన్లలో..

    గతంలో చైనాలో పీకే చిత్రం 4000 స్క్రీన్లలో రిలీజ్ కాగా, దంగల్ చిత్రాన్ని రికార్డు స్థాయిలో 7000 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. చైనాలో పంపిణీ వ్యవస్థ రంగంలో వాండాదే అగ్రస్థానం. వాండాకు దాదాపు 3000 స్క్రీన్లు చేతిలో ఉన్నాయి. వాండా పంపిణీ సంస్థ ప్రస్తుతం దంగల్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది.

    అద్భుతమైన రేటింగ్..

    అద్భుతమైన రేటింగ్..

    సినిమా వెబ్ పోర్టల్స్‌కు చైనా పెట్టింది పేరు. చైనాలో చాలా సినీ వెబ్‌సైట్లు ఉన్నాయి. దంగల్ సినిమాపై చాలా వెబ్‌సైట్లు సానుకూలమైన రివ్యూలు రాయడం గమనార్హం. చైనాలో ప్రముఖ సోషల్ మీడియా వీఛాట్ దంగల్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. తమ రివ్యూలో దంగల్ 9.8/10 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

    ఉద్వేగానికి లోనయ్యాను..

    ఉద్వేగానికి లోనయ్యాను..

    నేను ఇప్పటివరకు చూసిన సినిమాల్లో అత్యుత్తమైన చిత్రాల్లో దంగల్ ఒకటి. నేను ఇప్పుడు ఏ సినిమాకు రివ్యూ రాయలేదు. దంగల్ సినిమా చూసి ఉద్వేగానికి గురయ్యాను. సినిమా నవ్వించింది. ఏడిపించింది. మీరు ఈ సినిమాను మిస్ చేసుకోవద్దు అని దౌబాన్ అనే వెబ్‌సైట్‌కు చెందిన రివ్యూవర్ పేర్కొన్నారు.

    కంటతడి పెట్టాను..

    కంటతడి పెట్టాను..

    దంగల్ సినిమా చూస్తున్న సేపు ఉద్వేగానికి లోనయ్యాను. కంటతడిని తుడుచుకునేందుకు టిష్యూ కోసం బయటకు పెరిగెత్తాను. పక్క సీట్లో ఉన్న వ్యక్తి నుంచి రెండు టిష్యూలను తీసుకొన్నాను. ఓ సినిమా చూసిన తర్వాత తొలిసారి చప్పట్లు కొట్టాను అని ఓ ప్రేక్షకుడు మీడియాతో తన అనుభవాన్ని పంచుకొన్నారు.

    English summary
    Aamir Khan-starrer Dangal, which opened on May 5, had crossed Rs 20.65 crore by early Saturday, around four times the earlier high for an Indian film of Rs 5.7 crore set by PK. On China's most popular cinema portals, the film has garnered rave reviews from fans. On social media app WeChat, it enjoys the highest rating among films currently being shown in China with a 9.8 score out of ten.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X