Sir Movie Pre Release Bussiness: ధనుష్ మొదటి తెలుగు టార్గెట్.. ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ఎంతంటే?
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ నటించిన వాతి/సార్ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి ఫిబ్రవరి 17న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో కథానాయకుడు ధనుష్ తప్పితే దర్శకుడు నిర్మాతలు మిగతా చాలా వరకు టెక్నీషియన్స్ నటీనటులు కూడా తెలుగువారే కావడం విశేషం. ఇక తెలుగులో ఈ సినిమా ధనుష్ కు చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. సార్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకొని టాలీవుడ్ లో తన మార్కెట్ పెంచుకోవాలని అనుకుంటున్నాడు. ఇక సార్ సినిమా ఏపీ తెలంగాణలో ఎంత బిజినెస్ చేసింది? అలాగే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే...

సార్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని..
ధనుష్ ఎప్పటినుంచో తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో అతను నటించినా రఘువరన్ బీటెక్ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక తర్వాత వచ్చిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఈసారి మాత్రం సార్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని తెలుగులో ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా చేశాడు. అది సినిమాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది.

తెలుగు టీమ్ తో సిద్ధమైన సార్
ఈ సినిమాకు వర్క్ చేసిన చాలామంది తెలుగువారే కావడం విశేషం. దర్శకుడు వెంకీ అట్లూరి ఇంతకుముందు తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే త్రివిక్రమ్ హోమ్ ప్రొడక్షన్ ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ లో ఆయన సతీమణి సంయుక్తంగా నిర్మించారు.

థియేటర్ల సంఖ్య
ఇక సార్ సినిమా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో ముందు రోజే ప్రత్యేకంగా ప్రీమియర్స్ తో సందడి మొదలు చేసింది. ఇక మొత్తంగా అయితే నైజాం ఏరియాలో 150 థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా సీడెడ్ లో 55 థియేటర్లు, ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 200 థియేటర్లలో విడుదలవుతోంది ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా కలుపుకొని సార్ సినిమా 415 థియేటర్లలో విడుదలవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఎంతంటే
ఎడ్యుకేషన్ కు సంబంధించిన ఒక సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన సార్ సినిమా ట్రైలర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాకు తెలుగులో కూడా డీసెంట్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలుపుకొని ఈ సినిమా 5.5 కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద 6 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటేనే తెలుగులో సక్సెస్ అయినట్లు లెక్క.

వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్..
ఇక సార్ సినిమా తమిళంలో వాతి అనే పేరుతో విడుదలవుతోంది. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక వాతి సినిమా తెలుగు తమిళంలో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద 35 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే ఈ సినిమా రెండు భాషల్లో కూడా సక్సెస్ అయినట్లు లెక్క.


Click it and Unblock the Notifications











