Sir Day 5 Collections: తెలుగులో సక్సెస్ అయ్యింది కానీ.. ఇంకాస్త దూరంలోనే వాతి టార్గెట్!
తెలుగు తమిళ్ అని తేడా లేకుండా ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోలకు మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ధనుష్ తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక మొత్తానికి వాతి/సార్ సినిమాతో అతనికి సరైన విజయం దక్కింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా నాలుగు రోజుల్లోనే తెలుగులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది. ఇక వాతి టోటల్ టార్గెట్ మాత్రం పూర్తికాలేదు. ఇక ఐదవ రోజు ఈ సినిమాకు ఎంత కలెక్షన్స్ రావచ్చు? ఇక ఇప్పటివరకు ఎంత వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే..

విడుదలకు ముందే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ స్టోరీ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి మొదటిసారి తన స్టైల్ ను మార్చి ఒక మంచి సోషల్ మెసేజ్ పాయింట్ తో సార్ అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఈ సినిమాకు తమిళంలో కూడా విడుదలకు ముందే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీన విడుదలైన సార్ సినిమా పాటలు కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.

వరల్డ్ వైడ్ టార్గెట్
ఇక సార్ సినిమా డిమాండ్ కు తగ్గట్టుగానే తెలుగు తమిళంలో మంచి బిజినెస్ అయితే క్రియేట్ చేసింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు 450 థియేటర్లలో రిలీజ్ అవ్వగా మళ్లీ తర్వాత రెండవ రోజు నుంచి ఆ సంఖ్య కొంత పెరిగింది. ఇక టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది. ఇక ఈ సినిమా తెలుగు టార్గెట్ అయితే 6 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా రెండు భాషల్లో కలుపుకొని వాటి టార్గెట్ 36 కోట్లకు ఫిక్స్ అయింది.

4 రోజుల టోటల్ లెక్క
ఇక సార్ సినిమా అయితే మొదటి రెండు రోజుల్లోనే మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకోవడం విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ధనుష్ మొదటిసారి అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ సాధించాడు. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది అంటే.. తమిళనాడులో 19.50 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో 18.61 కోట్లు, కర్ణాటకలో 4.15 కోట్లు, కేరళలో 60 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో 75 లక్షలు, ఇక ఓవర్సీస్ లో 12.05.కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా 55.66 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ 28.90 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది.

5వ రోజు ఎంత రావచ్చు?
ఇక ఐదవ రోజు కూడా ఈ సినిమాకు కొంత డీసెంట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. మంగళవారం రోజు ఈ సినిమాకు మొత్తంగా అయితే 3.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. అంతకు ముందు రోజు కూడా దాదాపు ఇదే తరహాలో ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇండియా మొత్తంలో నెట్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమాకు 40 కోట్లు దాటినట్లుగా తెలుస్తోంది.

ఇంకా ఎంత రావాలి..?
వరల్డ్ వైడ్ గా వాతి సినిమా తెలుగులో అయితే టార్గెట్ సోమవారమే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో అయితే ఈ సినిమా నాలుగు కోట్లకు పైగా రేంజ్ లో ప్రాఫిట్ తో కొనసాగుతోంది. ఇక వరల్డ్ వైడ్ గా మాత్రం ఇంకా 7.10 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. ఇక మంగళవారం వచ్చిన కలెక్షన్స్ ని బట్టి చూస్తే ఈ సినిమాకు ఇంకా మరో మూడు నుంచి నాలుగు కోట్ల మధ్యలో షేర్ కలెక్షన్స్ వస్తే సక్సెస్ అయినట్లు లెక్క.


Click it and Unblock the Notifications











