Sir Day 2 Collections: తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ధనుష్ కుమ్ముడే కుమ్ముడు.. 2వ రోజు సాలీడ్!

తమిళ చిత్ర పరిశ్రమలో మంచి టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ధనుష్ మొదటిసారి తెలుగులో కూడా తన సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన వాతి సినిమా తెలుగులో సార్ టైటిల్ తో ఫిబ్రవరి 17వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది. ఇక ఈ సినిమా మొదటిరోజు మంచి ఒపెనింగ్స్ అందుకోగా రెండవ రోజు కూడా అదే తరహాలో కలెక్షన్స్ అందుకుంది. ఇక మొత్తంగా ఈ సినిమా రెండవ రోజు ఏ స్థాయిలో కలెక్ట్ చేయబోతోంది.. అనే వివరాల్లోకి వెళితే..

మంచి కథాంశంతో తెరకెక్కిన సార్

మంచి కథాంశంతో తెరకెక్కిన సార్

ధనుష్ ఎలాంటి సినిమా చేయాలని అనుకున్నా కూడా అందులో ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉండేలా కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు సార్ సినిమా లో కూడా మిడిల్ క్లాస్ లైఫ్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సోషల్ ఎలిమేట్ ను కూడా హైలెట్ చేశారు. ఇక తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమాను సీతార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..

ఇక సార్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ధనుష్ కెరిర్ లోనే అత్యధిక స్థాయిలో విడుదలైన సినిమాగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా 450 కి పైగా థియేటర్లలో విడుదలయింది. ఇక సినిమాకు బజ్ కూడా గట్టిగానే పెరిగింది. దీంతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 5.5 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 6 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఇక వరల్డ్ వైడ్ గా వాతి సినిమా రెండు భాషల్లో కలుపుకొని 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది.

మొదటి రోజు వచ్చిన టోటల్ కలెక్షన్స్

మొదటి రోజు వచ్చిన టోటల్ కలెక్షన్స్

మొదటిరోజు ఊహించినట్టే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. ధనుష్ గత రికార్డులను బ్రేక్ చేస్తూ తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. తమిళనాడులో మొదటి రోజు ఈ సినిమా 6 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 4.7 కోట్ల రేంజ్ లో రాగా రెస్టాఫ్ ఇండియాలో 0.8 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో ఐదు కోట్లు వచ్చాయి. మొత్తంగా వాతి సినిమా రెండు భాషల్లో మొదటి రోజు 16.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 9 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది.

యూఎస్ వచ్చిన కలెక్షన్స్

యూఎస్ వచ్చిన కలెక్షన్స్

ఇక ఓవర్సీస్ లో ముఖ్యంగా సార్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూఎస్ఏ లో కూడా అధిక స్క్రీన్ లలో ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. సార్ సినిమా మొదట గురువారం ప్రీమియర్స్ కు 98 లోకేషన్స్లలో 37.847 డాలర్స్ రాగా తమిళంలో వాతి సినిమాకు 14,832 డాలర్లు వచ్చాయి. ఇక మొత్తంగా అయితే ప్రీమియర్స్ కు ఈ సినిమా 52.679 డాలర్స్ ను సొంతం చేసుకుంది. ఇక శుక్రవారం రోజు రాత్రి 8 గంటల సమయానికి మొత్తంగా తెలుగు తమిళంలో కలిపి 40,848 డాలర్లను సొంతం చేసుకుంది.

 2వ రోజు థియేట్రికల్ ఆక్యుపెన్సి

2వ రోజు థియేట్రికల్ ఆక్యుపెన్సి

రెండో రోజు కూడా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా చాలా ఏరియాలో ఈ సినిమా రెండో రోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కొనసాగింది. ఇక థియేటర్ ఆక్యుపెన్సి విషయానికి వస్తే.. తమిళంలో అయితే సాయంత్రం షోలకు వచ్చేసరికి 47.29% థియేటర్ ఆక్యుపెన్సి నమోదయింది. ఇక తెలుగులో చూసుకుంటే ఇంకాస్త ఎక్కువగా సాయంత్రం షోలకు వచ్చేసరికి 63.51% ఆక్యుపెన్సి నమోదయింది.

2 రోజుల్లో వచ్చిన టోటల్ కలెక్షన్స్

2 రోజుల్లో వచ్చిన టోటల్ కలెక్షన్స్

ఇక మొదటి రోజు ఇండియా మొత్తంలో కూడా వాతి సినిమా రెండు భాషల్లో కలుపుకొని 9.7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా సమాచారం. ఇక రెండవ రోజు ఈ సినిమా అంతకంటే ఎక్కువ స్థాయిలో 11 కోట్ల గుపైగా నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక దాదాపు రెండు రోజుల్లో ఈ సినిమాకు మొత్తంగా అయితే 20.70 కోట్ల రేంజ్ లో రేంజ్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. శనివారం హాలిడే కావడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆదివారం కూడా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X