Sir Day 3 Collections: ముడవరోజు మరింత పెరిగిన కలెక్షన్స్.. తమిళ భాషకు ఈక్వల్ గా టాలీవుడ్ లెక్కలు!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన వాతి సినిమా తెలుగులో సార్ గా ఫిబ్రవరి 17వ తేదీన గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోల ద్వారా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఇక మూడవరోజు కూడా ఈ సినిమాకు అంతకంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ఇప్పటివరకు సార్ సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ..

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ..

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సార్ సినిమా కథాంశం ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో చదువుకు సంబంధించిన అంశాలను మంచి ఎంటర్టైన్మెంట్ స్టోరీ తో డెవలప్ చేసిన విధానం బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాకు క్లాస్ ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా మాస్ ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా కలెక్షన్స్ పెరుగుతూ ఉండడం విశేషం. అలాగే మూడవ రోజు ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

సార్ సినిమాను తెలుగులో భారీ స్థాయిలోనే విడుదల చేశారు. ఒక విధంగా ధనుష్ కెరీర్ మొత్తంలో కూడా అత్యధిక థియేటర్లలో విడుదలైన తెలుగు సినిమాగా సార్ రికార్డు క్రియేట్ చేసింది. ఏపీ తెలంగాణలో 450 కి పైగా థియేటర్లలో మొదట ఈ సినిమాను విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఆ సంఖ్య 500 దాటింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5.5 కోట్ల రేంజ్ లో రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక తెలుగులో ఈ సినిమా టార్గెట్ 6 కోట్లు నమోదు కాగా వాతి సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లకు ఫిక్స్ అయ్యింది.

రెండు రోజుల కలెక్షన్స్

రెండు రోజుల కలెక్షన్స్

ధనుష్ సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా మాస్ ఆడియోన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే మొదటి రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.7 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకోగా రెండో రోజు కూడా 5 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 5.80 కోట్లు షేర్ కలెక్షన్స్, 10.54 కోట్లు గ్రాస్ దక్కింది.

3వ రోజు థియేట్రికల్ ఆక్యుపెన్సీ

3వ రోజు థియేట్రికల్ ఆక్యుపెన్సీ

సార్ సినిమాకు మొదటి రెండు రోజుల్లో కంటే కూడా మూడవరోజు మరింత ఎక్కువ స్థాయిలో రెస్పాన్స్ రావడం విశేషం. ఇక ఈ సినిమా తమిళంలో సాయంత్రం షోలకు 57.47 థియేటర్ ఆక్యుపెన్సి నమోదు చేయగా మూడవరోజు తెలుగులో సాయంత్రం షోలకు వచ్చేసరికి 72.53% థియేటర్ ఆక్యుపెన్సి నమోదు చేసింది. మొదటి రెండు రోజుల కంటే మూడవ రోజు అద్భుతమైన రెస్పాన్స్ రావడం విశేషం

3 రోజుల తెలుగు కలెక్షన్స్

3 రోజుల తెలుగు కలెక్షన్స్

ఇక సార్ సినిమా ఆదివారం చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మూడవరోజు ఈ సినిమా రెండు కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక అటు ఇటుగా నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావచ్చు అని తెలుస్తోంది. తమిళనాడులో ఎలాగైతే కలెక్షన్స్ వస్తుందో తెలుగులో కూడా అదే తరహాలో ఈ సినిమాకు రెస్పాన్స్ వస్తూ ఉండడం విశేషం.

 వరల్డ్ వైడ్ టోటల్ లెక్క..

వరల్డ్ వైడ్ టోటల్ లెక్క..

ఇక ఇండియా మొత్తంలో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే మూడవరోజు అయితే 12.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి రోజు 9.7 కోట్లు రాగా.. 2వ రోజు 11.6 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక సార్ సినిమా మూడవరోజు రెండు భాషల్లో కలుపుకొని అంతకంటే ఎక్కువ స్థాయిలో 12 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే మొత్తంగా ఇండియాలో మూడు రోజుల్లో కలుపుకొని 33 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X