Sir Day 1 Collections: రఘువరన్ బీటెక్ రికార్డులు బ్లాస్ట్.. ఒక్క రోజులోనే ధనుష్ కెరీర్ బెస్ట్ ఒపెనింగ్స్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన ప్రయోగాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ధనుష్ ఇప్పుడు తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక చాలా కాలం క్రితం రఘువరన్ బీటెక్ సినిమా ద్వారానే అతనికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు సార్ సినిమాతో కూడా అతను రేంజ్ పెంచుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేయవచ్చు.. అనే వివరాల్లోకి వెళితే..

ముందురోజే ప్రీమియర్ షోలు

ముందురోజే ప్రీమియర్ షోలు

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సీతార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన వాతి/సార్ సినిమా తెలుగు తమిళంలో ఒకేరోజు విడుదల అయింది. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేసిన చిత్ర యూనిట్ ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ను కూడా ప్రదర్శించింది. ఇక వాటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్

బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్

సార్ సినిమా ద్వారా ధనుష్ మొదటిసారి తెలుగులో అత్యధిక స్థాయిలో ఒపెనింగ్స్ అందుకోబోతున్నాడు. ఇక ఈ సినిమాను మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే 415 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 5.5 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వాతి/సార్ సినిమా టార్గెట్ 35 కోట్లుగా నమోదయింది.

థియేటర్ ఆక్యుపెన్సి ఎంత?

థియేటర్ ఆక్యుపెన్సి ఎంత?

సార్ సినిమాకు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ఇక ఈ సినిమాకు తెలుగులో ట్రైలర్ ద్వారా కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. తమిళంలో సాయంత్రం షోలకు వచ్చేసరికి దాదాపు 38 శాతానికి పైగా థియేటర్ ఆక్యుపెన్సి అయితే నమోదయింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈవినింగ్ షోలకు వచ్చేసరికి ఏపి నైజాంలో 44.09 శాతం థియేటర్ ఆక్యుపెన్సి నమోదైంది.

 తమిళంలో ఎంత రావచ్చు?

తమిళంలో ఎంత రావచ్చు?

ఇక సార్ సినిమాకు తమిళ్ తెలుగులో మొదటి రోజు ఎంతవరకు కలెక్షన్స్ అందుతాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొదటిరోజు అంచనా ప్రకారం అయితే తమిళంలో 7 నుంచి 8 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ రావచ్చు అని తెలుస్తోంది. అదే జరిగితే ఈసారి వాతి సినిమా ధనుష్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.

 తెలుగులో ఫస్ట్ డే కలెక్షన్స్

తెలుగులో ఫస్ట్ డే కలెక్షన్స్

ఇక తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ముందు రోజు ప్రీమియర్స్ ప్రదర్శించగా దాదాపు అన్ని స్క్రీన్స్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. కాబట్టి మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని ఈ సినిమాకు మొత్తంగా అయితే 4 నుంచి 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో రఘువరన్ బీటెక్ సినిమా అయితే మొత్తంగా నాలుగు కోట్లకు పైగా కలెక్షన్స్ అందుతుంది. ఆ రికార్డును ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తోనే బ్రేక్ చేయవచ్చు.

 ప్రపంచవ్యాప్తంగా వచ్చే కలెక్షన్స్..

ప్రపంచవ్యాప్తంగా వచ్చే కలెక్షన్స్..

సార్ సినిమాకు మ్యూజిక్ మాత్రమే కాకుండా ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా తెలుగులో ధనుష్ కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా సినిమాను బాగానే ప్రమోట్ చేశాడు. ఇక డీసెంట్ టాక్ తో ఈ సినిమా ఇండియా మొత్తంలో కూడా మొదటి రోజు ఏడు నుంచి 8 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వాతి సినిమా 10 కోట్లకు పైగా ఒపెనింగ్స్ అందుకోవచ్చు అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X