Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెలుగు రాష్ట్రాల్లో 'దర్బార్' హవా.. అన్ని ఏరియాలనూ దున్నేసిన రజినీకాంత్.. డీటైల్ రిపోర్ట్
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇచ్చారు. తన తాజా సినిమా 'దర్బార్'తో వసూళ్ల ప్రవాహం పారించారు. జనవరి 9న విడుదలైన ఈ సినిమా తమిళనాడు, ఓవర్సీస్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుమ్మేసింది. రజినీ స్టైల్‌కి తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో తొలిరోజే దర్బార్ హవా కనిపించింది. పూర్తి వివరాల్లోకి పోతే..
తెలుగు, తమిళ భాషల్లో.. అంచనాలకు రెట్టింపు రెస్పాన్స్
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది 'దర్బార్' మూవీ. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలకు రెట్టింపు రెస్పాన్స్ తెచ్చుకుంది. తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి రజినీ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాగా తన పేరును లిఖించుకుంది 'దర్బార్' మూవీ.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజే..
బ్యాడ్ పోలీస్ ఆఫీసర్‌గా రజినీకాంత్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన స్టైల్, మ్యానరిజం మిస్మరైజ్ చేశాయి. దీంతో ఎక్కడ చూసినా రజినీ హంగామానే కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజే 4.52 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది దర్బార్.
ఏరియావైజ్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఏరియావైజ్ తొలి రోజు రిపోర్ట్ చూస్తే.. నైజాంలో 2.10 కోట్లు, సీడెడ్‌లో 70 లక్షలు, ఉత్తరాంధ్రలో 44 లక్షలు, ఈస్ట్ గోదావరి 28 లక్షలు, వెస్ట్ గోదావరి 18 లక్షలు, గుంటూరు 40 లక్షలు, కృష్ణా 24 లక్షలు, నెల్లూరు 18 లక్షలు, మొత్తంగా చూస్తే 4.52 కోట్లు రాబట్టింది దర్బార్.
బ్రేక్ ఈవెన్ చేరాలంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దర్బార్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 14.2 కోట్ల మేర జరిగింది. అంటే 'దర్బార్' బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 15 కోట్లు రాబట్టాలి. ఈ నేపథ్యంలో తొలిరోజే 4.52 కోట్లు షేర్ చేకూరింది కాబట్టి మరో రెండు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఖాయం అని స్పష్టమవుతోంది.
100 కోట్ల మార్క్.. సంబరాల్లో అభిమానులు
తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దర్బార్ హవా నడించింది. దీంతో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది దర్బార్. ముఖ్యంగా తమిళనాడు ప్రేక్షకులు తొలి రోజే ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం చూసి సంబరాల్లో మునిగితేలుతున్నారు.