Darling Business: హనుమాన్ నిర్మాతకు కళ్లు చెదిరే లాభాలు.. డార్లింగ్ రిలీజ్‌కు ముందే ఎన్ని కోట్లంటే?
సౌత్ ఇండియా సినిమాలో అందులోని తెలుగు సినిమాలో కూడా ఉన్నటువంటి ప్రెజెంట్ యువ హీరోయిన్స్ లో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కూడా ఒకామె.. కాగా దర్శకుడు పూరి జగన్నాథ్ తో క్రేజీ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ తో టాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకొని యూత్ లో మంచి క్రేజ్ ని తాను సొంతం చేసుకుంది. అక్కడ నుంచి టాలీవుడ్ లో మంచి ఆఫర్లు అందుకొని వస్తున్నా ఈమె తాజాగా నటించిన చిత్రమే "డార్లింగ్".
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ టైటిల్ 'డార్లింగ్' తో రావడంతోనే మేకర్స్ మొదటి నుంచి ఈ సినిమాకి మంచి అటెన్షన్ ని పట్టేశారు. కాగా ఈ సినిమాలో టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా నటించడం కూడా కొంచెం పెద్ద విషయమే అని చెప్పుకోవాలి. ఇలా ఓ ఫన్ డ్రామాగా మొదలైన ఈ చిత్రాన్ని మేకర్స్ మొదటి నుంచి కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు.

సోషల్ మీడియాలో ఒకరినొకరు డార్లింగ్ అంటూ పిలుచుకోవడం. దీనితో నభా నటేష్ ఏ అమ్మాయిని అయినా ఇష్టం లేకుండా తెలియని అమ్మాయిని కానీ డార్లింగ్ అని పిలిస్తే కేసు వెయ్యొచ్చు అంటూ బాగానే ప్రమోట్ చేయడంతో ఆడియెన్స్ లోకి సినిమా బాగానే వెళ్ళింది. ఇలా ఫైనల్ గా ఈ నెల 19న థియేటర్స్ లో రిలీజ్ కి ఈ సినిమా వచ్చింది. అయితే కొన్ని చిన్న చిత్రాలకి థియేటర్స్ లో వచ్చి లాభాలు పొందడం అనేది చాలా పెద్ద విషయమే అని చెప్పాలి.
సినిమాని ప్రమోట్ చేయడం వరకు అంతా మేకర్స్ కి ఖర్చు, భారమే తప్ప ఈ తరహా సినిమాలకి ఎప్పుడూ టెన్షన్ గానే ఉంటుంది. కానీ కొన్ని రేర్ కేసుల్లో మాత్రం విడుదలకి ముందే కొన్ని చిత్రాలు టేబుల్ ప్రాఫిట్స్ గట్టిగా చూస్తాయి. రిలీజ్ తర్వాత సినిమా ఫలితం ఏమో కానీ అంతకు ముందే ఈ చిత్రం భారీ లాభాలని చూసినట్టుగా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

కాగా ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల బడ్జెట్ అయితే ఈ బడ్జెట్ ని కేవలం ఈ సినిమా సౌత్ లో ఓటిటి, శాటిలైట్ హక్కులతోనే రాబట్టేసిందట. ఇక హిందీ డబ్బింగ్ ఓటిటి శాటిలైట్ హక్కులు మరో 2 కోట్లు అదనం అని తెలుస్తుంది. దీనితో థియేటర్స్ లోకి రాక ముందే 2 కోట్ల ప్రాఫిట్స్ వచ్చేస్తే.. థియేట్రికల్ బిజినెస్ మరో 8 కోట్లు జరిగిందట. దీనితో సినిమా రిలీజ్ కి రాకుండానే ఏకంగా 10 కోట్ల లాభాన్ని అందిపుచ్చుకుంది.
కాగా ఈ చిత్రాన్ని హను మాన్ మేకర్స్ నిర్మాణం వహించగా వారు ఈ సినిమాతో మరో జాక్ పాట్ కొట్టేశారని చెప్పాలి. అలాగే ఈ సినిమా మెయిన్ గా నభా నటేష్ చుట్టూతానే తిరుగుతుంది కాబట్టి ఈ లాభాల్లో ఆమెకి కూడా గట్టి భాగమే ఉంటుందని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు రామ్ అశ్విన్ తెరకెక్కించగా సుహాస్, అనన్య నాగళ్ళ, బ్రహ్మానందం తదితర ప్రధాన తారాగణం నటించారు.


Click it and Unblock the Notifications











