Darling Day 2 Collections డార్లింగ్‌కు 8 కోట్ల టార్గెట్.. నష్టాల్లో నుంచి బయటపడాలంటే?
టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ నభా నటేష్, యాక్టర్ ప్రియదర్శి పులికొండ జంటగా నటించిన డార్లింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతున్నది. హనుమాన్‌తో సంచలన విజయం సాధించిన నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా గత రెండు రోజుల్లో ఎలాంటి స్పందన కూడగట్టుకొన్నది? ఈ సినిమా కలెక్షన్లు ఏ మేరకు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
మనిషిలో అనేక కోణాలతో (Split Personality Disorder) మానసిక రుగ్మత అనే కాన్సెప్ట్‌తో అపరిచితుడు తరహాలో ఓ ప్రయోగం చేశారు. అయితే ఈ సినిమాకు పెద్దగా సానుకూలత కనిపించడం లేదు. ఈ సినిమా ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ మెప్పించలేకపోయిందనే ప్రతికూలత సోషల్ మీడియాలో కనిపించింది. దాంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా నత్త నడక నడుస్తున్నది.

డార్లింగ్ సినిమాను సుమారుగా 12 కోట్ల రూపాయలతో రిచ్‌గా నిర్మించారు. అయితే అందులో స్టార్లకు ఉన్న పాపులారిటీ, మార్కెట్ కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేశారనే టాక్ కూడా వినిపించింది. అయితే ఈ సినిమాను 8 కోట్ల రూపాయలతో ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ చేశారు. ఓటీటీ రైట్స్ వల్ల భారీగా ఆదాయం దాంతో నిర్మాతకు రిలీజ్ ముందే భారీ లాభాలు వచ్చాయి అనే విషయం ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక డార్లింగ్ మూవీ తొలి రోజు పేలవమైన వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు 35 లక్షల షేర్, 70 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక రెండో రోజు కూాడా అంతే మొత్తంలో అంటే 35 లక్షల షేర్ వసూలు చేస్తూ.. మరో 1 కోటి రూపాయలు తన ఖాతాలో వేసుకొన్నది.

డార్లింగ్ చిత్రం గత రెండు రోజుల్లో 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అలాగే 70 లక్షల షేర్ రాబట్టింది. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం ఇంకా 8.3 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











