Darling4K Re-Release Box Office: డార్లింగ్ రీ రిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్‌లో ప్రభాస్ మూవీకి కలెక్షన్స్ ఎంతంటే?

ప్రస్తుతం రీ రిలీజ్ కల్చర్‌లో నిర్మాతలు బాగానే లాభాలు అందుకుంటున్నారు. డ్రై సీజన్‌లో రీ రిలీజ్‌ల వల్ల థియేటర్లు కూడా ప్రేక్షకుల రాకతో సందడిగా మారుతుండటంతో పాత హిట్ సినిమాలను ఈ జనరేషన్‌కు తగినట్లుగా అత్యాధునిక 4కే వెర్షన్, డాల్బీ డీటీఎస్ ఎఫెక్ట్స్‌తో వదులుతున్నారు మేకర్స్. తెలుగునాట రీ రిలీజ్ బొమ్మలకు మంచి ఆదరణ లభిస్తోంది. పోకిరి, బిజినెస్‌మెన్, మురారి, అతడు, గబ్బర్‌సింగ్, జల్సా, ఖుషి, శివ, మనసంతానువ్వే, ఆరెంజ్ తదితర సినిమాలు రీ రిలీజ్‌‌లో మంచి వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. ఇటీవలే ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న రేసుగుర్రం మూవీని విడుదల చేయగా.. మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వంతు వచ్చింది.

Also Read
'విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌కి రెడీ.. నా తర్వాతే రష్మిక’
'విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌కి రెడీ.. నా తర్వాతే రష్మిక’

ఏప్రిల్ 23న డార్లింగ్ రీ రిలీజ్
ప్రభాస్ కెరీర్‌లో డార్లింగ్ సినిమాకు ప్రత్యేక స్థానముంది. ఈ చిత్రానికి ముందు ఆయన వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ను మరోసారి లవర్ బాయ్‌గా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసింది డార్లింగ్. కథ, కథనం, పాటలు, కాజల్ అందాలతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అలాంటి డార్లింగ్ చిత్రాన్ని అత్యాధునిక 4కే, డాల్బీ వెర్షన్‌లో అభిమానుల కోసం రీ రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 23న డార్లింగ్ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

Darling4K Re-Release Box Office Prabhas and Kajal Aggarwal Starrer Advance booking Collection Report

డార్లింగ్ తారాగణం
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ డార్లింగ్ చిత్రాన్ని నిర్మించగా.. ప్రేమకథల స్పెషలిస్ట్ ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ప్రభు, తులసి, శ్రద్ధాదాస్, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, ముఖేష్ రిషి, కోటా శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23, 2010న డార్లింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Recommended For You
సూపర్‌స్టార్ కొడుకుని 6 ఏళ్లు వెంటాడిన హీరోయిన్... బిడ్డని అలా కాపాడుకున్న నటుడు
సూపర్‌స్టార్ కొడుకుని 6 ఏళ్లు వెంటాడిన హీరోయిన్... బిడ్డని అలా కాపాడుకున్న నటుడు

డార్లింగ్ టోటల్ కలెక్షన్స్
నటీనటులు, సాంకేతి నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి డార్లింగ్ సినిమాను 23 కోట్ల రూపాయలతో నిర్మించారు. అప్పట్లో 16.8 కోట్ల రూపాయల బ్రేక్ఈవెన్ టార్గెట్‌తో డార్లింగ్ మూవీ తన థియేట్రికల్ జర్నీ ప్రారంభించింది. ఈ సినిమా నైజాంలో 7.86 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3.55 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 1.80 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 1.48 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 1.3 కోట్ల రూపాయలు, గుంటూరులో 1.45 కోట్ల రూపాయలు, కృష్ణాలో 1.3 కోట్ల రూపాయలు, నెల్లూరులో 90 లక్షల రూపాయలు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా+ కర్ణాటకలో 1.20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.1 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా దాదాపు 36 కోట్ల రూపాయల గ్రాస్.. 22 కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

You May Also Like
'ఆ క్షణంలో అలా లొంగిపోయా.. అన్నీ కోల్పోయాకే విలువ తెలిసేది’
'ఆ క్షణంలో అలా లొంగిపోయా.. అన్నీ కోల్పోయాకే విలువ తెలిసేది’

ఇండియాలో డార్లింగ్ అడ్వాన్స్ బుకింగ్
డార్లింగ్ రీ రిలీజ‌్‌లో భాగంగా ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఇండియాలో బుకింగ్ ఓపెన్ అయ్యింది. ఆరోజున 39,590 టికెట్లు, ఏప్రిల్ 18న 16120 టికెట్లు, ఏప్రిల్ 19న 13690 టికెట్లు చొప్పున అమ్ముడైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో డార్లింగ్ రీ రిలీజ్‌లో 147 థియేటర్లలో 500 షోలకు గాను 106,466 టికెట్లు అమ్ముడై 41.7 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదవ్వగా భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 1.48 కోట్ల రూపాయలు వసూలైంది. తెలంగాణలో 92 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 43 లక్షల రూపాయలు, కర్ణాటకలో 9 కోట్ల రూపాయలు చొప్పున గ్రాస్ రాబట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

విడాకులపై టీవీకే విజయ్ అనూహ్య నిర్ణయం.. సంగీతతో అలాంటి డీల్? భార్యకు ఎన్ని కోట్లంటే?
విడాకులపై టీవీకే విజయ్ అనూహ్య నిర్ణయం.. సంగీతతో అలాంటి డీల్? భార్యకు ఎన్ని కోట్లంటే?

ఓవర్సీస్‌లో డార్లింగ్ అడ్వాన్స్ బుకింగ్
అటు ఓవర్సీస్‌లోనూ డార్లింగ్ రీ రిలీజ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో బుకింగ్ ఓపెన్ అవ్వగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తొలి రోజున స్పెషల్ షోల అడ్వాన్స్ బుకింగ్ పరిశీలిస్తే.. 75 సెంటర్లలో 115 షోలకు గాను 1572 టికెట్లు అమ్ముడై 11875 డాలర్లు (దాదాపు 11 లక్షల రూపాయలు) వసూలైంది. దాంతో వరల్డ్ వైడ్‌గా డార్లింగ్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు 1.60 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రీ రిలీజ్‌కు మరో రెండు రోజులు సమయం ఉండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Read more about: prabhas darling box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X