Darling Re Release Day 1 Collection: రీ రిలీజ్‌లో డార్లింగ్‌కి భారీ వసూళ్లు.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ నటించిన డార్లింగ్ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న వరల్డ్ వైడ్‌గా రీ రిలీజైన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ములేపింది. ఈ నేపథ్యంలో రీ రిలీజ్‌లో డార్లింగ్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? గతంలో రీ రిలీజైన సినిమాలను ప్రభాస్ బద్ధలు కొట్టాడా? లేదా? ఈ వివరాలు పరిశీలిస్తే..
డార్లింగ్ తారాగణం
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ డార్లింగ్ చిత్రాన్ని నిర్మించగా.. ప్రేమకథల స్పెషలిస్ట్ ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ప్రభు, తులసి, శ్రద్ధాదాస్, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, ముఖేష్ రిషి, కోటా శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23, 2010న డార్లింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

థియేటర్ల వద్ద సందడి
ప్రభాస్ కెరీర్‌లోనే క్లాసిక్ మూవీగా నిలిచిన డార్లింగ్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మాస్, యాక్షన్ హీరోగా దూసుకెళ్తున్న ప్రభాస్‌ను .. ఫుల్ లెంగ్త్ లవర్ బాయ్‌గా చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. రిలీజ్‌కి మించి అభిమానులు హడావుడి చేశారు. దీనికి తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్‌లో డార్లింగ్‌కి కలెక్షన్ల పంట పండింది. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఓవర్సీస్‌లో డార్లింగ్ వసూళ్లు
ఓవర్సీస్‌లో డార్లింగ్ రీ రిలీజ్‌లో తొలిరోజు 32093 డాలర్లు (భారత కరెన్సీలో 30 లక్షల రూపాయలు) వసూలైంది. ఇందులో నార్త్ అమెరికా నుంచి 20,962 (82 లక్షల రూపాయలు), యూకే నుంచి 7708 పౌండ్లు (9.77 లక్షల రూపాయలు), ఆస్ట్రేలియా నుంచి 1K ఆస్ట్రేలియా డాలర్లు (67102 రూపాయలు) చొప్పున వసూలైనట్లు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
భారత్‌లో డార్లింగ్ వసూళ్లు
ఇక భారత్‌లో డార్లింగ్ రీ రిలీజ్ వసూళ్లను పరిశీలిస్తే.. అడ్వాన్స్ బుకింగ్‌లోనే దాదాపు 3 కోట్ల రూపాయలు రాబట్టాడు ప్రభాస్. దేశవ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారా 29 షోలకు గాను 71 శాతం ఆక్యూపెన్సీతో 25 లక్షల రూపాయలకు పైగా రాబట్టింది. ఇక తొలిరోజున 1661 షోలకు గాను 46.3 శాతం ఆక్యూపెన్సీతో భారత్‌లో 4.45 కోట్ల రూపాయలు రాబట్టింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా డార్లింగ్ రీ రిలీజ్‌లో తొలిరోజున 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దాంతో రీ రిలీజ్‌లలో తొలిరోజు 5 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించిన తెలుగు సినిమాల లిస్ట్‌లో చేరింది డార్లింగ్. ఇంతకు ముందు బిజినెస్‌మెన్, మురారి, గబ్బర్ సింగ్, ఖలేజా, బాహుబలిలు ఈ ఫీట్ సాధించాయి.
గబ్బర్ సింగ్ రికార్డు సేఫ్
అయితే ప్రభాస్ మూవీ రీ రిలీజ్‌లో 7.59 కోట్ల రూపాయలు రాబట్టిందని పోస్టర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అదే నిజమైతే.. రీ రిలీజ్‌లో డార్లింగ్ చరిత్ర సృష్టించినట్లే. నాన్ బాహుబలి చిత్రాల్లో రీ రిలీజ్‌లలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ 8 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్‌తో టాప్‌లో ఉంది. ఆ తర్వాత మహేశ్ బాబు నటించిన ఖలేజా 6.34 కోట్ల రూపాయలతో సెకండ్ ప్లేస్‌లో ఉండేది. ఇప్పుడు ఖలేజా రికార్డ్‌ను డార్లింగ్ బద్ధలు కొట్టినట్లే. అయితే డార్లింగ్ రీ రిలీజ్ వసూళ్లపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications