Darling Re Release Box Office: రీ రిలీజ్‌లో డార్లింగ్ వసూళ్ల జాతర.. ప్రభాస్ మూవీకి 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ నటించిన డార్లింగ్ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న వరల్డ్ వైడ్‌గా రీ రిలీజైన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రీ రిలీజ్‌లలో సంచలనం విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ మూవీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టింది? గతంలో రీ రిలీజైన సినిమాలను ప్రభాస్ బద్ధలు కొట్టాడా? లేదా? ఈ వివరాలు పరిశీలిస్తే..
డార్లింగ్ తారాగణం
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ డార్లింగ్ చిత్రాన్ని నిర్మించగా.. ప్రేమకథల స్పెషలిస్ట్ ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ప్రభు, తులసి, శ్రద్ధాదాస్, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, ముఖేష్ రిషి, కోటా శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23, 2010న డార్లింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

డార్లింగ్ తొలిరోజు కలెక్షన్స్
డార్లింగ్‌కు రీ రిలీజ్‌లో తొలిరోజున ప్రీమియర్స్‌తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 4.21 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 35.50 లక్షల రూపాయలు, తమిళనాడు+ రెస్టాఫ్ ఇండియాలో 3.5 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో తొలిరోజున 4.60 కోట్ల రూపాయలు రాబట్టింది. నార్త్ అమెరికాలో 19.67 లక్షల రూపాయలు, యూకేలో 9.77 లక్షల రూపాయలు, ఆస్ట్రేలియాలో 67 వేలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 5.36 కోట్ల రూపాయలు రాబట్టింది.
డార్లింగ్ మూడు రోజుల కలెక్షన్స్
రెండో రోజు డార్లింగ్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కోటి 30 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 20 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 35 లక్షల రూపాయల చొప్పున 1.85 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక మూడో రోజున కూడా ప్రభాస్ హవా ఏమాత్రం తగ్గలేదు. సమ్మర్ సెలవులకు తోడు, వీకెండ్ కావడంతో శనివారం కూడా కోటి రూపాయలను తన ఖాతాలో వేసుకున్నాడు డార్లింగ్. దాంతో డార్లింగ్ రీ రిలీజ్‌లో 3 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 10.44 కోట్ల రూపాయలు వసూలు చేశాడు.
డార్లింగ్ నాలుగో రోజు వసూళ్ల అంచనా
రిలీజ్ సినిమాలతో పోటీపడుతూ ప్రభాస్ ఛరిష్మాతో డార్లింగ్ మూవీ మంచి ఆక్యూపెన్సీ నమోదు చేసింది. బుక్ మై షోలో డార్లింగ్‌కు ఇప్పటి వరకు 259K టికెట్లు బుక్ అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. బుక్ మై షో లెక్కల ప్రకారం రీ రిలీజ్‌లలో బాహుబలి ది ఎపిక్ ఏకంగా 834K టికెట్లు బుక్ చేసి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత డార్లింగ్ (259K), ఖలేజా (258K), గబ్బర్ సింగ్ (210K), బిజినెస్‌మెన్ (190Kలు నిలిచాయి. మరి రీ రిలీజ్‌లలో డార్లింగ్ ఎన్ని లక్షల టికెట్లు సేల్ చేస్తుందో చూడాలి. నాలుగో రోజు డార్లింగ్ మూవీ కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ప్రభాస్ మూవీ 4 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 12 కోట్లకు పైగా రాబడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications