Kranti Day 2 Collections దుమ్ము రేపుతున్న దర్శన్ మూవీ.. కంతారాను మించిన కలెక్షన్లు!
తమిళ సూపర్ స్టార్ దర్శన్, అందాల భామ రచిత రామ్, సీనియర్ స్టార్ హీరో, హీరోయిన్లు రవిచంద్రన్, సుమలత, సంపత్ రాజ్, తరుణ్ అరోరా నటించిన చిత్రం క్రాంతి. వీ హరికృష్ణ దర్శకత్వం వహించిన చిత్రానికి సురేషా, శైలజా నాగ్ నిర్మాతలుగా వ్యవహరించారు. మీడియా హౌస్ స్టూడియో బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26వ తేదీన రిలీజైంది. ఈ చిత్రానికి సంబంధించిన తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి? రెండో రోజు బాక్సాఫీస్ అంచనాలు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

క్రాంతి కథ ఏమిటంటే?
క్రాంతి సినిమా కథ విషయానికి వస్తే.. క్రాంతి రాయన్న యూరప్‌లో కోట్లు సంపాదించిన బిజినెస్ మ్యాగ్నెట్. తను చదివిన స్కూల్ 100వ వార్షికోత్సవానికి రావాలంటూ క్రాంతిని హెడ్మాస్టర్ ఆహ్వానిస్తారు. అయితే తన బాల్యంలో చదువుకొన్న స్కూల్ నేలమట్టమై శిథిలావస్థలో ఉంటుంది. అయితే అవినితీపరుడైన విద్యామంత్రి వామన్ రావు (సంపత్ రాజ్) అండతో అక్రమాలకు పాల్పడే బిజినెస్ మ్యాన్ సలాత్రి.. రాష్ట్రంలోని 12 వేల స్కూళ్లను ప్రైవేటీకరణ చేయాలని తప్పుడు రీతిలో జీవో పాస్ చేయిస్తారు. ఈ అవినీతి బాగోతంపై పోరాటం మొదలుపెట్టిన క్రాంతి.. ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.

30 కోట్ల బడ్జెట్.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
కన్నడ చిత్రం క్రాంతిని సుమారు 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారు 20 కోట్లుగా జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను 21 కోట్లుగా నిర్ణయించారు. ఇలాంటి టార్గెట్‌తో క్రాంతి చిత్రం బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది.

క్రాంతి తొలి రోజు ఆక్యుపెన్సీ
క్రాంతి సినిమాను సుమారు 300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఇండియా వైడ్‌గా ఈ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. బెంగళూరులో 70 శాతం, హుబ్లీలో 56 శాతం, మంగళూరులో 22 శాతం, గుల్బర్గాలో 77 శాతం, బెలగాంలో 30 శాతం, ముంబైలో 64 శాతం, మైసూర్‌లో 90 శాతం, శివమొగలో 69 శాతం, రాయ్‌చూర్‌లో 90 శాతం, హైదరాబాద్‌లో 100 శాతం, చెన్నైలో 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఫస్ట్ డే క్రాంతి కలెక్షన్లు ఎంతంటే?
క్రాంతి చిత్రం తొలి రోజున భారీగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం తొలి రోజున ఇండియా వైడ్ 10 కోట్ల షేర్, 13 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దర్శన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే బిగ్ వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి

కాంతారను మించిన కలెక్షన్లు
కన్నడ సినిమా పరిశ్రమలో అత్యధికంగా తొలి రోజు వసూలు చేసిన సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి. కేజీఎపఫ్ చిత్రం 30 కోట్లు, జేమ్స్ చిత్రం 28 కోట్లు, విక్రాంత్ రోనా 24 కోట్లు, రాబర్ట్ 18 కోట్లు, గాలిపట2 15 కోట్లు, 777 ఛార్లీ 5 కోట్లు, కంతారా చిత్రం తొలి రోజున 5 కోట్లు వసూలు చేసింది. దర్శన్ నటించిన క్రాంతి చిత్రం 13 కోట్ల గ్రాస్ ర రాబట్టింది.

రెండో రోజు క్రాంతి కలెక్షన్ల అంచనా
ఇక క్రాంతి సినిమా 2 వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడంతో స్టాంగ్‌గా ఆక్యుపెన్సీ కనిపించింది. ఈ చిత్రం రెండో రోజున కూడా భారీగానే వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. రెండో రోజు ఈ చిత్రం 5 కోట్ల షేర్, 9 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 20 కోట్ల గ్రాస్ సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











