Das Ka Dhamki day 1 collections విశ్వక్ సేన్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
యువ హీరో విశ్వక్ సేన్ నటించడమే కాకుండా దర్శకత్వం వహించి.. నిర్మించిన చిత్రం దాస్ కా ధమ్కీ. నివేదా పేతురాజ్, రావు రమేష్, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

ధమ్కీకి మిక్స్‌డ్ టాక్
దాస్ కా ధమ్కీ సినిమా విషయానికి వస్తే.. పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతోపాటు విశ్వక్ సేన్‌కు యూత్‌లో ఉండే క్రేజ్‌తో మంచి ఓపెనింగ్స్ కూడా నమోదయ్యాయి. అయితే ఈ సినిమా క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ అందుకొన్నది. ఈ నేపథ్యంలో సినిమా కలెక్షన్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

ధమ్కీ బడ్జెట్ 20 కోట్లుగా
దాస్ కా ధమ్కీ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. స్వయంగా నిర్మాత కరాటే రాజు.. అనుకొన్న బడ్జెట్ కంటే మూడు రెట్లు పెరగడమే కాకుండా పని రోజులు కూడా భారీగా పెరిగాయి అని చెప్పారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా వ్యయం 20 కోట్లుగా అంచనా వేశారు. దాంతో భారీ బడ్జెట్ చిత్రం జాబితాలోకి దాస్ కా ధమ్కీ చేరిపోయింది.

ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్
దాస్ కా ధమ్కీ బడ్జెట్ పరంగానే కాకుండా బిజినెస్ పరంగా భారీ రేంజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 3 కోట్లు, సీడెడ్‌లో 1 కోటి, ఆంధ్రాలో 3 కోట్లుగా అంచనా వేశారు. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు దాదాపు 7 కోట్ల మేర అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఆంధ్రా, నైజాం మినహాయిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోకి వెళితే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కుల విలువ 80 లక్షలుగా, ఓవర్సీస్ ఇతర అంశాలు కలుపుకొని మొత్తంగా 10 కోట్లుగా ఈ సినిమా బిజినెస్ జరిగిందనేది ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా భారీగానే నిర్ణయించారు.

ధమ్కీ సినిమా స్క్రీన్ కౌంట్
దాస్ కా ధమ్కీ చిత్రం విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రమోషనల్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ, నందమూరి తారక రామారావు రావడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. దాంతో ఈ సినిమాను తెలంగాణలో 220 స్క్రీన్లు, ఆంధ్రాలో 220 స్క్రీన్లు, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 210 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో కలిపి మొత్తంగా 650 స్క్రీన్లలో రిలీజైంది.

ధమ్కీ సినిమా ఆక్యుపెన్సీ
ఇక దాస్ కా ధమ్కీ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఉగాది పండుగ కారణంగా సెలవు దినం కావడంతో ఈ మూవీ ఆక్యుపెన్సీ కూడా పాజిటివ్‌గా కనిపించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 40 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. ఉదయం షోలకు స్లోగా ఉన్నా. మధ్యాహ్నం, ఫస్ట్ షోలకు భారీగా పెరగడం ఓ పాజిటివ్ అంశంగా మారింది. లాంగ్ వీకెండ్ కావడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

విశ్వక్ సేన్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు?
దాస్ కా ధమ్కీ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విశ్వక్ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా తొలిరోజు 1.8 కోట్లు షేర్ రాబట్టింది. ఈ సినిమాకు మంచి ధమ్కీ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ రిపోర్టు. తాజా అంచనాల ప్రకారం.. 2.5 కోట్ల నుంచి 3 కోట్ల షేర్.. 4 కోట్ల నుంచి 6 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

ధమ్కీ సినిమా లాభాల్లోకి రావాలంటే?
దాస్ కా ధమ్కీ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ చిత్రం కనీసం 10 కోట్ల షేర్ బాక్సాఫీస్ వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా 10 కోట్లకుపైగా షేర్, 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. విశ్వక్ సేన్ తన స్టామినాను పెంచుకొని.. ఈ సినిమాను లాభాల్లోకి చేర్చుతాడా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











