Dasara day 1 collections నాని బాక్సాఫీస్ కుమ్ముడు.. దసరా తొలి రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దసరా చిత్రం భారీ రెస్పాన్స్‌ను బాక్సాఫీస్ వద్ద కూడగట్టుకొంటున్నది. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్ స్డడీగా నమోదు అవుతున్నది. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

నైజాం, ఆంధ్రాలో దసరా ప్రీ రిలీజ్ బిజినెస్
దసరా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా భారీ బిజినెస్‌ను నమోదు చేసింది. నైజాం థియేట్రికల్ హక్కులు 13.7 కోట్లు, సీడెడ్ 6.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.9 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.35 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్లు, గుంటూరు 3 కోట్లు, కృష్ణా 2 కోట్లు, నెల్లూరు జిల్లా హక్కులు 1.2 కోట్లకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ 34.65 కోట్లుగా నమోదైంది.

తెలుగేతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో
ఇక తెలుగేతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కూడా దసరా థియేట్రికల్ హక్కులకు భారీగా డిమాండ్ కనిపించింది. కర్ణాటక థియేట్రికల్ హక్కులు 1.85 కోట్లు, ఇతర (తమిళ, మలయాళం) భాషల హక్కులు 1.5 కోట్లు, ఉత్తర భారతదేశంలో 4 కోట్లకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా మొత్తంగా 48 కోట్ల మేర బిజినెస్ చేసింది. నాని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ బిజినెస్ కావడం విశేషంగా మారింది.

దసరా థియేటర్ కౌంట్
ఇక తెలుగు రాష్ట్రాల థియేటర్ కౌంట్ విషయానికి వస్తే.. నైజాంలో సుమారు 300 స్క్రీన్లు, సీడెడ్‌లో 190 స్క్రీన్లు, ఆంధ్రాలో 410 కుపైగా స్క్రీన్లలో ప్రదర్శించారు. దాంతో ఈ సినిమా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 900 స్క్రీన్లకుపైగా ప్రదర్శించడం నాని సినిమాల విషయంలో ఓ రికార్డుగా మారింది. ఇక తెలుగేతర రాష్ట్రాల విసయానికి వస్తే.. కర్ణాటకలో 80 స్క్రీన్లకుపైగా, తమిళనాడులో 80 స్క్రీన్లకుపైగా, కేరళలో 100 స్క్రీన్లకుపైగా, హిందీలో 750 స్క్రీన్లకుపైగా దసరా సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇక ఓవర్సీస్‌లో 800 స్క్రీన్లకుపైగా ప్రదర్శిస్తున్నారు. దాతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2700 స్క్రీన్లకుపైగా ప్రదర్శిస్తున్నారు.

దసరా ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే?
దసరా సినిమా తొలి రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. తెలుగులో ఓవరాల్‌గా 65 శాతం ఆక్యుపెన్సీతో మంచి రెస్పాన్స్ కనిపించింది. తమిళం, కన్నడ, మలయాళంలో పెద్దగా ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయిందనే విషయం ఆక్యుపెన్సీ స్పష్టం చేసింది. తమిళంలో 20 శాతం, కన్నడలో 22 శాతం, హిందీలో 10 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో కలెక్షన్లు
అమెరికాలో దసరా మూవీ ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే... ఈ చిత్రం భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా $637K అంటే 5.22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కడపటి వార్తలు అందేసరికి తొలి రోజు 100K డాలర్లు అంటే 80 లక్షల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజుకల్లా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇక యూకే, ఆస్ట్రేలియా ఇతర దేశాల విషయానికి వస్తే.. ప్రీమియర్ల ద్వారా యూకేలో భారీగావసూళ్లు నమోదు అయ్యాయి. 29 లొకేషన్లలో, 39 షోల కోసం 4 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. 44 లొకేషన్లలో, 89 షోల కోసం 3 వేల టికెట్లు అమ్ముడుపోయాయి.

హైదరాబాద్, నైజాం, ఆంధ్రాలో
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో దసరా సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భారీగా కలెక్షన్లు నమోదు చేసింది. సుమారు 700 షోల ద్వారా ఈ చిత్రం 3.8 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టింది. కరెంట్ బుకింగ్ వివరాలు అందాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 15 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్ల అంచనా
దసరా సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం 17 నుంచి 20 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 20 నుంచి 25 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే నాని పాన్ ఇండియా వ్యూహం వర్కవుట్ అయినట్టేనని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

దసరా లాభాల్లోకి రావాలంటే?
దసరా మూవీ ప్రపంచవ్యాప్తంగా 48 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. ఈ చిత్రం 50 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. అయితే ఈ సినిమా తొలి రోజు జోష్‌ను తొలివారం ప్రదర్శిస్తే.. లాభాల్లోకి రావడమే కాకుండా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











