Dasara 3 days collections 100 కోట్ల క్లబ్‌కు చేరువగా దసరా.. బాక్సాఫీస్ వద్ద నాని కలెక్షన్ల సునామీ

నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన దసరా చిత్రం దేశవ్యాప్తంగా పలు భాషల్లో భారీ వసూళ్లను రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 30వ తేదీన రిలీజైంది. ఈ సినిమా తొలి రోజు నుంచే హట్ టాక్‌తో దూసుకెళ్లింది. దాంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. గత రెండు రోజుల కలెక్షన్లు, మూడో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..

వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్

వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్

దసరా చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం థియేట్రికల్ హక్కులు 13.7 కోట్లు, సీడెడ్ 6.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.9 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.35 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్లు, గుంటూరు 3 కోట్లు, కృష్ణా 2 కోట్లు, నెల్లూరు జిల్లా హక్కులు 1.2 కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 34.65 కోట్లుగా బిజినెస్ చేసింది. కర్ణాటక థియేట్రికల్ హక్కులు 1.85 కోట్లు, ఇతర (తమిళ, మలయాళం) భాషల హక్కులు 1.5 కోట్లు, ఉత్తర భారతదేశంలో 4 కోట్లకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా మొత్తంగా 48 కోట్ల మేర బిజినెస్ చేసింది.

దసరా తొలి రోజు కలెక్షన్లు

దసరా తొలి రోజు కలెక్షన్లు


దసరా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో 22.45 కోట్ల షేర్, తమిళంలో 10 లక్షలు, కన్నడలో 20 లక్షలు, మలయాళంలో 10 లక్షలు, హిందీలో 53 లక్షల షేర్ సాధించింది. దాంతో ఓవర్సీస్‌తో కలుపుకొని ఈ సినిమా 26 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

దసరా రెండో రోజు కలెక్షన్లు

దసరా రెండో రోజు కలెక్షన్లు

ఇక దసరా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో 9.16 కోట్లు, తమిళంలో 6 లక్షలు, కన్నడలో 20 లక్షలు, హిందీలో 43 లక్షలు, మలయాళంలో 8 లక్షల వసూళ్లు సాధించింది. దాంతో ఈ చిత్రం ఇండియావైడ్ 9.75 కోట్ల షేర్ వసూలు చేసింది. అమెరికా ఓవర్సీస్‌లో కలిపి ఈ చిత్రం 53 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా సాధించింది.

ఓవర్సీస్‌లో దసరా హంగామా

ఓవర్సీస్‌లో దసరా హంగామా

ఇక ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. దసరా చిత్రం అమెరికాలో 1.2 మిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియాలో 85 షోల ద్వారా 1680 టికెట్లు అమ్ముడుపోయాయి. యూకేలో కూడా భారీ వసూళ్లను సాధించింది. ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో కలిపి దాదాపు 10 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసినట్టు సమాచారం.

దసరా మూడో రోజు కలెక్షన్ల అంచనా

దసరా మూడో రోజు కలెక్షన్ల అంచనా

ఇక మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళంలో కలిపి ఈ చిత్రం 12 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్‌ విషయానికి వస్తే.. అమెరికాలో మూడో రోజు 435 లోకేషన్లలో, 1265 షోల ద్వారా 100K డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. ఇక హైదరాబాద్‌లో 570కు పైగా షోల ద్వారా 45 శాతం ఆక్యుపెన్సీతో 2.38 కోట్లు వసూలు చేసింది. దాదాపు ఈ చిత్రం 16 నుంచి 17 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

దసరా లాభాల్లోకి వచ్చేదెపుడంటే?

దసరా లాభాల్లోకి వచ్చేదెపుడంటే?

దసరా సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే దిశగా అడుగులేస్తున్నది. నైజాంలో ఈ సినిమాకు మంచి రెస్సాన్స్ వస్తుండగా, ఆంధ్రాలో కొంత నిదానంగా ముందుకెళ్తున్నది. వారాంతానికి కల్లా పలు చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి వారం ముగిసే సమాయానికి 100 కోట్ల గ్రాస్ మైలురాయిని చేరుకొంటుందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X