Dasara 4 days Collections బాక్సాఫీస్ వద్ద దసరా ధూమ్ ధామ్.. నాని ఖాతాలో 100 కోట్లు!
టాలీవుడ్‌లో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన దసరా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తీ సురేష్ నటించిన ఈ సినిమా తొలి ఆట నుంచే హిట్ టాక్‌తో మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకొన్నది. శ్రీరామనవమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం తొలివారం రికార్డు వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా ఆదివారం అంటే రిలీజైన తర్వాత 4వ రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే?

ఇండియావైడ్ ఆక్యుపెన్సీ ఇలా..
దసరా సినిమా తొలివారాంతంలో స్టడీగా ఆక్యుపెన్సీని సాధించింది. 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలకు 42 శాతం, మ్యాట్నీకి 61 శాతం, ఫస్ట్ షోకు 62 శాతం, సెకండ్ షోకు 42 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఆదివారం రోజు ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో 52 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. తమిళం విషయానికి వస్తే.. 22 శాతం, హిందీ 15 శాతం, మలయాళం 6 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

4 రోజుల తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు
తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల్లో.. దసరా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 22.45 కోట్లు, రెండో రోజు 9.16 కోట్లు, మూడో రోజు 11.25 కోట్లు, నాలుగో రోజు 11.75 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో 55 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

తమిళంలో నాలుగు రోజుల వసూళ్లు
తమిళంలో గత నాలుగు రోజుల్లో దసరా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 10 లక్షలు, రెండో రోజు 6 లక్షలు, మూడో రోజు 10 లక్షలు, నాలుగో రోజు 11 లక్షల వసూళ్లు సాధించింది. దాంతో ఈ చిత్రం 37 లక్షల రాబట్టింది. అయితే ఈ సినిమాకు శింబు నటించిన పత్తు తలా, విజయ్ సేతుపతి సూరి నటించిన విడుదలై పార్ట్ 1 సినిమాలు భారీ పోటీగా నిలిచాయి.

కన్నడలో మోస్తారుగా కలెక్షన్లు
కన్నడ వెర్షన్ దసరా సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 20 లక్షలు, రెండో రోజు 20 లక్షలు, మూడో రోజు 30 లక్షలు, నాలుగో రోజు 20 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 90 లక్షల వసూళ్లను సాధించింది. కన్నడ భాషలో దసరా చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కన్నడలో మధ్యస్తంగా కలెక్షన్లు సాధిస్తున్నది.

హిందీలో పుంజుకొంటున్న వసూల్లు
ఇక హిందీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఉత్తరాదిలో నాని సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. దసరా రిలీజ్ తర్వాత స్టడీగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తొలి రోజు 53 లక్షలు, రెండో రోజు 43 లక్షలు, మూడో రోజు 65 లక్షలు, నాలుగో రోజు 81 లక్షల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో 2.4 కోట్లు వసూలు చేసింది.

మలయాళంలో డిజాస్టర్‌గా
ఇక మలయాళంలో దసరా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అక్కడ డిజాస్టర్ టాక్‌తో ముందుకెళ్తున్నది. మలయాళంలో తొలి రోజు 10 లక్షలు, రెండో రోజు 8 లక్షలు, మూడో రోజు 8 లక్షలు, నాలుగో రోజు 8 లక్షలు వసూలు చేసింది. దాంతో గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం 34 లక్షలు రాబట్టింది.

ఓవర్సీస్‌లో ధూమ్ ధామ్‌గా
ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. దసరాకు బ్రహ్మండమైన రెస్పాన్స్ లభిస్తున్నది.అమెరికాలో తొలి రోజు 4.2 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు కూడా స్టడీగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజు 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన ఈ చిత్రం అదే జోష్‌ను కొనసాగిస్తున్నది. రెండో రోజు 101 కోట్లు, మూడో రోజు 1.2 కోట్లు, నాలుగో రోజు 2 కోట్ల మేర వసూళ్లను సాధించింది. యూకే, ఆస్ట్రేలియా, ఇతర ప్రాంతాలల్ో కలిపి ఇప్పటి వరకు ఈ చిత్రం 8 కోట్ల షేర్, 12 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?
ఇక ప్రపంచవ్యాప్తంగా దసరా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు 55 కోట్ల రూపాయలు, హిందీ 2.4 కోట్ల రూపాయలు, కన్నడలో 90 లక్షల రూపాయలు, మలయాళంలో 34 లక్షల రూపాయలు, తమిళంలో 37 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. అమెరికాలో యూకే, ఆస్ట్రేలియా, మిగితా ప్రాంతాల్లో కలపి ఈ చిత్రం దాదాపు 90 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 5 వ రోజు నాని ఖాతాలో 100 కోట్ల గ్రాస్ సినిమాగా రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది.

నైజాం, ఆంధ్రాలో
తెలుగు రాష్ట్రాల్లో దసరా కలెక్షన్ల విషయానికి వస్తే.. 4వ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 12 లక్షలతో కలిపి నైజాంలో 3.95 కోట్లు, శ్రీకాకుళంలో 6.6 లక్షలతో కలిపి ఉత్తరాంధ్రలో 60 లక్షలు, ఆదోని 2.5, అనంతపురంలో 7 లక్షలు, కర్నూలులో 12 లక్షలతో కలిపి సీడెడ్‌లో 50 లక్షలు, తాడేపల్లి గూడెంలో 1.7 లక్షలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











