Dasara 4 days Collections దసరా కలెక్షన్లు భారీగా డ్రాప్..అయినా 100 కోట్లకు చేరువలో నాని మూవీ! 5వ రోజు ఎంతంటే?

టాలీవుడ్‌లో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన దసరా చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరును కొనసాగిస్తున్నది. నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకెళ్తున్నది. రిలీజ్ నుంచి తొలివారాంతం వరకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం 5వ రోజున ఎలాంటి వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

దసరా 5వ రోజు ఆక్యుపెన్సీ

దసరా 5వ రోజు ఆక్యుపెన్సీ

దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఆక్యుపెన్సీని సాధించింది. 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలకు 35 శాతం, మ్యాట్నీకి 40 శాతం, ఫస్ట్ షోకు 50 శాతం, సెకండ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. సోమవారం రోజు ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో 40 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తమిళం విషయానికి వస్తే.. 15 శాతం, హిందీ 15 శాతం, మలయాళం 4 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

 గత 4 రోజుల్లో దసరా కలెక్షన్లు

గత 4 రోజుల్లో దసరా కలెక్షన్లు

దసరా సినిమాకు సంబంధించి గత నాలుగు రోజుల వసూళ్ల వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో కలిపి భారీగా వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు 23.2 కోట్లు, రెండో రోజు 9.75 కోట్లు, మూడో రోజు 12.1 కోట్లు, నాలుగో రోజు 12.6 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలో సుమారు ఈ చిత్రం 57 కోట్ల వసూళ్లను రాబట్టింది.

 5వ రోజు దసరా కలెక్షన్లు

5వ రోజు దసరా కలెక్షన్లు

ఇక దసరా చిత్రం 5వ రోజు తెలుగులో 3.72 కోట్లు, తమిళంలో 6 లక్షలు, హిందీలో 44 లక్షలు, మలయాళంలో 4 లక్షలు వసూలు చేసింది. కన్నడలో సుమారు 20 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 5 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.

యూఎస్‌లో నాని రేర్ రికార్డు

యూఎస్‌లో నాని రేర్ రికార్డు

ఇక ఓవర్సీస్‌లో దసరా చిత్రం భారీగానే వసూళ్లను నమోదు చేసింది. అమెరికాలో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్నది. ఈ చిత్రం నాని కెరీర్‌‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం అమెరికాలో 1.7 మిలియన్ డాలర్లు అంటే సుమారు 14 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

దసరా వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎంతంటే?

దసరా వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎంతంటే?

దసరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు 60 కోట్ల రూపాయలు, హిందీ 2.8 కోట్ల రూపాయలు, కన్నడలో 1.3 కోట్ల రూపాయలు, మలయాళంలో 60 లక్షల రూపాయలు, తమిళంలో 43 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 66 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

అమెరికాలో 14 కోట్లు, యూకే, ఆస్ట్రేలియా, మిగితా ప్రాంతాల్లో కలపి ఈ చిత్రం దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తొలివారంలో నాని చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X