Dasara Collections 100 కోట్లు కొల్లగొట్టిన దసరా.. నాని కెరీర్‌లో అరుదైన రికార్డు!

టాలీవుడ్‌లో దసరా చిత్రం అరుదైన మైలురాయిని అందుకొన్నది. నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేమ్ కీర్తీ సురేష్ జంటగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తూ దూసుకెళ్తున్నది. తొలి రోజే రికార్డు కలెక్షన్లను క్రియేట్ చేసిన ఈ చిత్రం భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా 7వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

దసరా మూవీ గత 6 రోజుల వసూళ్ల వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో గట్టిగానే వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు 23.2 కోట్లు, రెండో రోజు 9.75 కోట్లు, మూడో రోజు 12.1 కోట్లు, నాలుగో రోజు 12.6, ఐదో రోజు 3.65 కోట్లు, ఆరో రోజు 3.25 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలో సుమారు ఈ చిత్రం 64 కోట్ల వసూళ్లను రాబట్టింది.

Dasara Collections 100

దసరా సినిమా ఏడో రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. తెలుగు భాషలో సుమారు 25 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తమిళంలో 20 శాతం, హిందీలో 15 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఏపీ, తెలంగాణ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఉత్తరాంధ్రలో 3.75 కోట్లఉ, సీడెడ్‌లో 6.40 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్లు, నైజాంలో 20 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో 37 కోట్ల షేర్, 63 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక కర్ణాటకలో 4.15 కోట్లు, ఇతర భాషల్లో 1.36 కోట్లు రాబట్టింది.

ఇక హిందీలో దసరా కలెక్షన్లు నిలకడగా ఉండటం సానుకూలంగా మారింది. ఉత్తరాంధ్రలో ఈ చిత్రం 1.7 కోట్లు, ఓవర్సీస్‌లో 15 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 54 కోట్లు షేర్, 96 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 100 కోట్లకు చేరువైంది.

దసరా చిత్రం ఇండియాలో 2 కోట్ల షేర్, 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో సుమారు 20 లక్షల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది. నైజాంలోనే ఈ చిత్రం ఇంకా స్ట్రాంగ్‌గా వసూళ్లను రాబడుతుండటం విశేషంగా మారింది. ఈ చిత్రం నానీ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డును నెలకొల్పొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X