Dasara Advance Booking యూకే, అమెరికాలో భారీ ఓపెనింగ్స్.. నాని మూవీకి ఊహించని రెస్పాన్స్.. ఎన్ని కోట్లంటే!
నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తీ సురేష్ నటించిన దసరా చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో దుమ్ము రేపుతున్నాయి. దాంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 30న పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు కావడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్ విషయానికి వస్తే..

బుక్ మై షోలో ఫుల్ క్రేజీగా
దసరా సినిమా విషయానికి వస్తే.. నాని గెటప్, కీర్తీ సురేష్ బాడీ లాంగ్వేజ్, సినిమా కలర్ టోన్, తెలంగాణ బ్యాక్ డ్రాప్ ట్రైలర్‌లో చక్కగా కుదరడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు ఆన్‌లైన్ టికెటింగ్ వెబ్‌సైట్ బుక్‌మై షోలో 100k మంది ఈ సినిమాను చూడటానికి క్యూరియస్‌గా ఉండటం ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఉత్సాహాన్ని తెలియజేస్తుంది.

నాని కెరీర్‌లో ముందెన్నడూ లేని విధంగా
నాని కెరీర్‌లో ఇప్పటి వరకు లేని విధంగా భారీ బడ్జెట్‌తో దసరాను తెరకెక్కించారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమాను దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. దాంతో దసరా సినిమాకు భారీ బిజినెస్ కూడా జరిగినట్టు కూడా తెలిసింది. అంతేకాకుండా నాని కెరీర్‌లో ఇప్పటి వరకు రిలీజ్ కాని విధంగా రికార్డు థియేటర్లలో దసరాను రిలీజ్ చేస్తున్నారు.

యూకేలో భారీ ఓపెన్సింగ్
దసరా మూవీ అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. యూకేలో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమాను 19 లోకేషన్లలో 25 షోలు ప్రదర్శించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం.. 1000 టికెట్స్‌పైగా అమ్ముడుపోయాయి. ఇంకా ఈ టికెట్ల అమ్మకాలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. అలాగే లోకేషన్లు, షో పెంచమని డిమాండ్ వస్తున్నట్టు సమాచారం.

అమెరికాలో రికార్డు లొకేషన్లలో
దసరా సినిమాకు అమెరికాలో కూడా భారీ క్రేజ్ లభిస్తున్నది. అయెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 315 లోకేషన్లలో ప్రీమియర్లు ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు. దాదాపు 900 షోలు ప్రీమియర్లుగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 130K అమెరికన్ డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

హైదరాబాద్‌లో ఊహించని రెస్పాన్స్
ఇక హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ రెస్సాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైన రెండో రోజే హౌస్‌పుల్స్ కనిపిస్తున్నాయని యూనిట్ వెల్లడించింది. రానున్న రోజుల్లో దసరా సినిమా రికార్డు వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తన్నాయి.


Click it and Unblock the Notifications











