Dasara Closing Collections నాని మూవీకి లాభమా? నష్టమా? 80 కోట్లు పెడితే ఎంతొచ్చింది?
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. నేచురల్ స్టార్ నాని, కీర్తీ సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని ఎలా ముగించింది? ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఎన్ని కోట్ల వసూళ్లను రాబట్టింది అనే వివరాల్లోకి వెళితే..
80 కోట్ల బడ్జెట్‌తో :దసరా చిత్రం మీడియం రేంజ్ బడ్జెట్ అంచనాతో షూట్ ప్రారంభమైనా.. చివరకు ఈ చిత్రానికి భారీగానే ఖర్చు అయింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు వచ్చిన క్రేజ్‌తో అంచనాలు పెరగడంతో భారీగానే రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్ల మేర అయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

దసరా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి :దసరా సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం నైజాంలో 13 కోట్లు, ఏపీలో 22 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటక హక్కులు 1.90 కోట్లు, ఇతర భాషలకు సంబంధించిన హక్కులను 1.5 కోట్లు, ఉత్తర భారతంలో హిందీ వెర్షన్ హక్కులు 4 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్ 6 కోట్ల రూపాయల మేర జరగడంతో సుమారుగా ఈ సినిమా బిజినెస్ 50 కోట్లుగా నమోదైంది.

ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు:ఇక దసరా తొలి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా నైజాంలో 25 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 5.5 కోట్ల రూపాయలు, గుంటూరులో 2 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 1.56 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.3 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.25 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఏపీ, నైజాంలో 43 షేర్, 70 కోట్ల గ్రాస్ రాబట్టింది.

దసరా ఇతర భాషల్లో :ఇక దసరా వివిధ భాషల్లో, ఇతర రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో తమిళనాడులో, కేరళలో, ఇతర రాష్ట్రాల్లో భారీగానే కలెక్షన్లను రాబట్టింది. కర్ణాటకలో 8.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.45 కోట్లు, కేరళలో 75 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో 8 కోట్లు వసూలు చేసింది. ఇక ఏపీ, తెలంగాణలో 43 కోట్ల షేర్, 70 కోట్ల గ్రాస్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం 90 కోట్ల షేర్ నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా దసరా కలెక్షన్లు:ఇక ప్రపంచవ్యాప్తంగా దసరా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, ఇతర రాష్ట్రాల్లో మినహాయిస్తే.. నైజాం, ఓవర్సీస్‌లో భారీగానే కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో 90 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. ఓవర్సీస్‌లో 20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 110 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసింది.

దసరా మూవీకి లాభమెంత? :దసరా సినిమా ఏ రేంజ్ లాభాలను సాధించిందనే విషయంలోకి వెళితే.. నిర్మాతకు, డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు మంచి లాభాలనే పంచిపెట్టింది. ఈ సినిమా 52 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ ప్రయాణం మొదలు పెట్టి.. 63 కోట్ల షేర్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్‌గా సుమారు 11 కోట్ల లాభాలను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











