Dasara Day 1 advance booking నాని కెరీర్‌లో ఊహించని కలెక్షన్లు.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేమ్ కీర్తీ సురేష్ జంటగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం దసరా. విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను సంపాదించుకొన్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే భారీ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబడుతున్నది. ఈ సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

దసరాకు ఆ రేంజ్

దసరాకు ఆ రేంజ్

ఉత్తరాదితోపాటు పలు భాషల్లో కేజీఎఫ్, కంతారా, RRR లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగించాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచిపెట్టడంతో నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. అయితే దసరా సినిమాను కూడా ఆ రేంజ్‌లో స్వాగతించేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.

రికార్డుస్థాయిలో టికెట్ బుకింగ్

రికార్డుస్థాయిలో టికెట్ బుకింగ్

తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, ఆంధ్రాలో భారీగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాను సుమారు 1300 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. నాని కెరీర్‌లో దసరా భారీగా రిలీజ్ అవుతున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేయబోతున్నది. ఇక హిందీ, ఓవర్సీస్‌లో కూడా రికార్డు సంఖ్యలో రిలీజ్ అవుతున్నది. ఇండియాలో ఇప్పటికే 86 వేల టికెట్లు అమ్ముడుపోయాయని ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్స్ వెల్లడించాయి.

హైదరాబాద్‌లో భారీ క్రేజ్

హైదరాబాద్‌లో భారీ క్రేజ్

దసరా చిత్రానికి హైదరాబాద్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను తొలి రోజు 400 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికిపైగా ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. తాజా ట్రేడ్ వర్గాల రిపోర్డు ప్రకారం.. ఈ చిత్రం హైదరాబాద్‌లోనే సుమారు 2 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

 యూఎస్ఏలో రికార్డు అడ్వాన్స్ బుకింగ్

యూఎస్ఏలో రికార్డు అడ్వాన్స్ బుకింగ్

ఇక అమెరికాలో ప్రీమియర్లకు మంచి డిమాండ్ కనిపించింది. యూఎస్ఏలో ఈ సినిమాను 325 లొకేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన 900 షోలకుపైగా స్క్రీనింగ్ చేసేందుకు సిద్దం చేశారు. ఇప్పటికే ఈ సినిమా 170K అమెరికన్ డాలర్లు అంటే.. 1.40 కోట్ల రూపాయాలను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

యూకేలో అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి

యూకేలో అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి

ఇక యూకేలో కూడా దసరా సినిమాకు భారీ ఆదరణ కనిపిస్తున్నది. ఈ సినిమాను 24 లోకేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలి రోజు కోసం 57 షోలు ప్రదర్శించనున్నారు. దాదాపు 1800 టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. యూకేలో దాదాపు 60 లక్షల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

వరల్డ్ వైడ్‌గా కలెక్షన్లు ఎంతంటే?

వరల్డ్ వైడ్‌గా కలెక్షన్లు ఎంతంటే?

ఇక దసరా చిత్రం తొలి రోజు కలెక్షన్లు నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ చిత్రం తొలి రోజున 15 నుంచి 20 కోట్ల మధ్య వసూళ్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాక్ బాగుంటే.. ఈ కలెక్షన్ల రేంజ్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X