Dasara Collections: అమెరికాలో దసరా మాస్ కొట్టుడు.. మహేశ్ రికార్డు బద్దలు.. ఏకైక హీరోగా నాని ఘనత
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుని.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగాడు టాలెంటెడ్ హీరో నాని. ప్రతి సినిమాలోనూ అదిరిపోయే నటనతో వన్ మ్యాన్ షో చేస్తోన్న అతడు.. వరుసగా ప్రయోగాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ నేచురల్ స్టార్ 'దసరా' అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాని యూఎస్‌లో రికార్డు సాధించాడు. ఆ వివరాలు మీరే చూడండి!

ధరణిగా ఎంట్రీ ఇచ్చిన నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన పక్కా మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు చేశారు.

నాని కెరీర్‌లోనే భారీగా రిలీజ్
రూరల్ బ్యాగ్‌డ్రాప్‌తో మాస్ మూవీగా రూపొందిన 'దసరా' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా చిత్రం కావడంతో దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2710కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికే యూఎస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. దీంతో అంతటా నేచురల్ స్టార్ నాని మేనియా కనిపిస్తోంది.

ఆరంభంలోనే అలాంటి టాక్
నాని - కీర్తి సురేష్ జంటగా నటించిన 'దసరా' మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు. కానీ, ఇక్కడ కూడా దీనికి పాజిటివ్ టాక్ దక్కింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో థియేటర్లు సందడిగా మారాయి.

హైదరాబాద్‌లో స్టార్ హీరోగా
నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' మూవీపై ఊహించని రీతిలో బజ్ ఉంది. దీనికితోడు టాక్ కూడా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పోటీ పడుతున్నారు. దీంతో ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇప్పటి వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా రూ. 4.15 కోట్లు గ్రాస్ రాబట్టి.. స్టార్ హీరోల చిత్రాలతో సమానంగా నిలిచింది.

ప్రీమియర్స్‌తో దసరా రచ్చ
శ్రీకాంత్ దర్శకత్వంలో నాని నటించిన 'దసరా' మూవీ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ బుకింగ్స్ విడుదల కంటే ముందుగానే ప్రారంభం అయ్యాయి. ఫలితంగా యూఎస్‌లో ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకు హాఫ్ మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా కలెక్షన్లు వచ్చినట్లు సదరు సంస్థ తాజాగా ప్రకటించింది.

మహేశ్ బాబు రికార్డు బ్రేక్
'దసరా' మూవీకి అమెరికాలో ప్రీమియర్స్ ద్వారానే 526k డాలర్స్ గ్రాస్ వసూలు అయింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 4.32 కోట్లు వచ్చాయి. ఇక, బుధవారం విడుదలై అత్యధిక ప్రీమియర్స్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఇది ఆరో స్థానంలో నిలిచింది. తద్వారా మహర్షిని వెనక్కి నెట్టేసింది. ఈ జాబితాలో 'సర్కారు వారి పాట' 952K డాలర్లతో టాప్ ప్లేస్‌లో ఉంది.

ఏకైక హీరోగా నాని ఘనత
మాస్ స్టోరీతో రూపొందిన 'దసరా' మూవీకి యూఎస్‌లో అత్యధిక ప్రీమియర్స్ కలెక్షన్లు వచ్చాయని ముందే చెప్పుకున్నాం. దీంతో టాలీవుడ్‌లోని టైర్ 2 హీరోల జాబితాలో నాని మొదటి స్థానానికి చేరుకున్నాడు. అంతకు ముందు ఆ రికార్డు విజయ్ దేవరకొండ 'లైగర్' (504K డాలర్లు) పేరిట ఉండేది. ఇప్పుడు నాని చిత్రానికి 526k డాలర్స్ వసూలు అయ్యాయి.


Click it and Unblock the Notifications











